టాలీవుడ్ సినిమాకి వంద కోట్ల మార్కెట్ ఓపెన్ అయ్యేలా చేసింది రాజమౌళి. ఆ తర్వాత చాలా మంది హీరోలు వంద కోట్ల గ్రాస్ మూవీస్ ను అందుకుని చరిత్ర సృష్టించారు. ఇప్పట్లో రూ.100 కోట్ల గ్రాస్ అనేది చాలా చిన్న విషయం అయిపోయింది. అయితే టాలీవుడ్ హీరోలకి మొదటి వంద కోట్ల గ్రాస్ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) రాంచరణ్ :
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘మగధీర’ సినిమాతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు చరణ్. ఈ సినిమా ఫైనల్ గా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
2) మహేష్ బాబు :
శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ‘దూకుడు’ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా ఫైనల్ గా రూ.101 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
3) పవన్ కళ్యాణ్ :
హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఫైనల్ గా రూ.108 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది ‘దబాంగ్’ కి రీమేక్ అనే సంగతి తెలిసిందే.
4) ప్రభాస్ :
‘బాహుబలి'(బాహుబలి : ది బిగినింగ్ ) చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా ఫైనల్ గా రూ.500 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
5) చిరంజీవి :
వినాయక్ దర్శకత్వంలో చేసిన ‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నారు చిరంజీవి. ఈ సినిమా ఫైనల్ గా రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళంలో రూపొందిన ‘కత్తి’ సినిమాకి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.
6) అల్లు అర్జున్ :
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘సరైనోడు’ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఫైనల్ గా రూ.125 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
7) ఎన్టీఆర్ :
కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఫైనల్ గా రూ.133 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
8) బాలకృష్ణ :
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు బాలయ్య. ఈ సినిమా ఫైనల్ గా రూ.117 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
9) వెంకటేష్ :
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘ఎఫ్ 2 ‘ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు వెంకీ. ఇందులో వరుణ్ తేజ్ కూడా మరో హీరోగా ఈ సినిమా ఫైనల్ గా రూ.132 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
10) నిఖిల్ :
చందూ మొండేటి దర్శకత్వంలో చేసిన ‘కార్తికేయ 2 ‘ చిత్రంతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు నిఖిల్. ఫైనల్ గా రూ.113 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
11) రవితేజ :
బాబీ దర్శకత్వంలో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు రవితేజ. ఈ సినిమా ఫైనల్ గా రూ.200 వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో చిరు మెయిన్ హీరోగా నటించారు.
12) సాయి ధరమ్ తేజ్ :
సముద్రఖని దర్శకత్వంలో చేసిన ‘బ్రో’ సినిమాతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా ఇంకా రన్ అవుతుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
13) నాని :
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన ‘దసరా’ సినిమాతో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని అందుకున్నాడు నాని. ఈ సినిమా ఫైనల్ గా రూ.117 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.