Heroes Wives: ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్లో స్టార్ హీరోస్ అనగానే గుర్తొచ్చే పేర్లు..రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు.. వీళ్లంతా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ రోజురోజుకూ తమ కలెక్షన్స్ పెంచుకుంటున్నారు. వంద కోట్ల క్లబ్ దాటి వేయికోట్ల వసూళ్ల వైపు అడుగులేస్తున్నారు. అయితే ఓవైపు ఈ స్టార్ హీరోలు బాక్సాఫీస్ను షేక్ చేస్తుంటే.. మరోవైపు వీళ్ల సతీమణులు బిజినెస్ రంగంలో దూసుకెళ్తున్నారు. బిజినెస్లో సక్సెస్ఫుల్గా రాణిస్తూ కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నమ్రత శిరోద్కర్ – మహేష్ బాబు :

నమ్రత ఒకప్పుడు హీరోయిన్గా రాణించినా.. పెళ్లి తర్వాత ఫ్యామిలీ బాధ్యతలకు పరిమితమైపోయింది. ఇక ఇప్పుడు మహేశ్ బాబు ప్రొడక్షన్ హౌస్ బిజినెస్ చూసుకుంటూ.. మరోవైపు మహేశ్ బ్రాండ్ హంబుల్ అనే టెస్క్ట్ టైల్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు నమ్రత. ఓవైపు ఇవన్నీ చుసుకుంటూనే మరోవైపు ఏఎంబీ మల్టీప్లెక్స్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.

లక్ష్మీ ప్రణతి – జూనియర్ ఎన్టీఆర్ :

జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. కానీ ప్రణతి త్వరలోనే ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ను స్టార్ట్ చేయబోతున్నారట.

ఉపాసన – రామ్ చరణ్ :

ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అపోలో హాస్పిటల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ.. మరోవైపు యువర్ లైఫ్ అనే హెల్త్ ఛానెల్ నడుపుతూ.. ఇంకోవైపు ఎయిర్లైన్స్ బిజినెస్ చూసుకుంటూ.. ఉన్నారు.

స్నేహ రెడ్డి – అల్లు అర్జున్ :

అల్లు అర్జున్-భార్య స్నేహా రెడ్డి సొంతంగా ఓ ఫొటో స్టూడియో నడిపిస్తున్నారు. అంతే కాకుండా. ఆమె తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

అంజనా దేవి – నాని :

నేచురల్ స్టార్ నాని భార్య అంజనా గురించి బయట ప్రపంచానికి చాలు తక్కువగా తెలుసు. అంజనా దేవి ఆర్కే మీడియాలో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తున్నారు. ఈమె బాహుబలి సినిమాకు కూడా వర్క్ చేశారట.

విరూపా కంటమనేని – అల్లరి నరేష్ :

స్టార్ హీరో అల్లరి నరేష్ భార్య కూడా బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. విరూప ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను రన్ చేస్తూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. ఈ రంగంలో చాలా అవార్డులను కూడా అందుకున్నారు.

భర్తలు టాలీవుడ్ను ఏలేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే.. వారి భార్యలు (Heroes Wives) బిజినెస్ రంగంలో దూసుకెళ్తూ కోట్ల టర్నోవర్లు సాధిస్తున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus