నిజ జీవితంలోను వెంకీ బాబు బంగారమే

  • August 11, 2016 / 10:09 AM IST

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరో. అయినా ఆ ఇమేజ్ కి అయన చాలా దూరం. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం బాబు బంగారం గా మనముందుకు వస్తున్నారు. ఆయన తెర పైనే కాదు.. నిజ జీవితంలోను బంగారమే. ఆయన గురించి తెలుసుకుంటే మీరు కూడా వెంకీ బాబు బంగారమే అని అంటారు. ఆ సంగతులు ఏమిటంటే..

1. ప్రతి క్షణం అనందం: మనం జీవించే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనేది వెంకటేష్ నమ్మిన సిద్దాంతం. అందుకే ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా హ్యాపీగా ఉండమంటారు. చెప్పడమే కాదు చేసి చూపించారు. వివిధ కార్యక్రమాలప్పుడు వెంకీ ప్రజల్లోకి వస్తే స్టార్ నంటూ కామ్ గా, హుందాగా ఉండకుండా అక్కడి వారిని నవ్వించే ప్రయత్నం చేస్తారు. వైజాక్ హుద్ హుద్ భాదితులకు సాహాయార్దం చేసిన షో లో వెంకీ అల్లరి ఎవరూ మరిచి పోలేరు.

2. అందరికి మిత్రుడుతెలుగు సినీ పరిశ్రమలోని నటులందరితో వెంకీ స్నేహంగా ఉంటారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ఇట్టే కలిసిపోతారు. శత్రువులు అంటూ లేని హీరో మన వెంకీ బాబు.

3 . వివాద రహితుడుఏ రంగంలోనైనా ప్రముఖులపై విమర్శలు వస్తుంటాయి. ఎంత మంచిగా ఉన్న కొన్ని వివాదాలు చుట్టుముట్టుతాయి. వెంకటేష్ 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ కాంట్రవర్సీలో చిక్కుకోలేదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటారు.

4. కుటుంబంలో ఒక్కడిగావెంకటేష్ సినీ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని చాలా చక్కగా మ్యానేజ్ చేస్తుంటారు. షూటింగ్ మినహా మిగతా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయిస్తారు. తండ్రి రామానాయుడు మంచాన పడి ఉంటే షూటింగ్ లన్నిటిని పక్కన పెట్టి ఆయనకి సపర్యలు చేశారు. కొడుకుగా తన బాధ్యతను నెరవేర్చారు.

5. ఈగో అంటే తెలియదుప్రతి ఒక్కరిలో కొంత ఈగో ఉండడం సహజం. కాని ఆధ్యాత్మిక భావం ఎక్కువగా కలిగిన వెంకటేష్ కి ఈగో అంటే ఏమిటో తెలియదు. నువ్వెంతా.. నేనెంత .. అనే ఆలోచన అతని కలలో కూడా రాదు. అవన్నీ పట్టించుకోరు కాబట్టే సీనియర్ నటుడు అయి ఉండి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ మూవీలు చేశారు.

ఇలా వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మంచి మనసున్న స్టార్, పేరుకు ముందు ఏ స్టార్ తగిలించుకోని హీరో.. ఇమేజ్ ని ఇంటి బయటే వదిలేసే వ్యక్తి వెంకీ. తెరపైనే కాదు నిజజీవితంలోనూ బాబు బంగారమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus