టాప్ టెన్ లో ఐదుగురు టాలీవుడ్ హీరోలే.. కానీ?

  • June 23, 2022 / 03:14 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ హీరోల భవిష్యత్తు సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ హీరోలలో ఎవరు నంబర్ వన్ అనే ప్రశ్నకు ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటైన ఆర్మాక్స్ మీడియా మే నెల పాపులర్ హీరోలకు సంబంధించి జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తొలి స్థానంలో నిలిచారు. పాన్ ఇండియా హిట్ ఖాతాలో లేకపోయినా విజయ్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. కేజీఎఫ్2 సినిమాతో ఘన విజయాన్ని సొంతం చెసుకున్న యశ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వరుసగా 6 నుంచి 9 స్థానాలలో నిలిచారు. కోలీవుడ్ హీరో సూర్య ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నుంచి పలువురు ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే ఈ సర్వే ఫలితాల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏ విధంగా సర్వే చేశారో ఎంతమంది ప్రేక్షకుల అభిప్రాయాలను కనుక్కున్నారో తెలియజేస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ సర్వేల ఫలితాలను పూర్తిస్థాయిలో నమ్మలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ ఫలితాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ ఫేవరెట్ హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడంతో కొంతమంది అభిమానులు ఫీలవుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus