‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!

  • June 12, 2022 / 10:59 AM IST

సాధారణంగా మన ఇండియన్ మూవీస్ లో… ఒక్కో సినిమాకి 120 నిమిషాల నిడివి అదే 2 గంటల రన్ టైం కలిగి ఉంటుంది. దానిని మించితే 150 నిముషాలు అంటే 2:30 గంటల రన్ టైం కలిగి ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాలు 2:30 గంటలకి మించి రన్ టైం కలిగి ఉంటున్నాయి.అవి 2:45 నిమిషాల నుండీ కొన్ని సినిమాలు అయితే 3 గంటలు నిడివి కూడా దాటేస్తున్నాయి. తెలుగులో ‘రంగస్థలం’ ‘అర్జున్ రెడ్డి’ ‘మహానటి’ తో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఈ మధ్య కాలంలో ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు కొన్ని సినిమాలు రెండున్నర గంటలకి పైగా రన్ టైం కలిగి ఉండడం గమనార్హం. తాజాగా వచ్చిన ‘విక్రమ్’ మూవీతో కోలీవుడ్ మేకర్స్ కూడా ఈ ట్రెండ్ కు పునాది వేసినట్టు అయ్యింది.

అయితే ఎడిటింగ్ పూర్తయ్యాక కూడా ఫైనల్ కట్ కు ఇంతింత రన్ టైం వచ్చేస్తుంది. దర్శకనిర్మాతలు అయితే కథ, కథనాల ప్రకారమే ఎక్కువ రన్ టైం వస్తున్నాయి అని చెబుతున్నారు. అయితే ఎక్కువ రన్ టైం ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తే కొన్ని సన్నివేశాలు డిలీట్ చేయడం వంటివి కూడా చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా.. పాండమిక్ తర్వాత విడుదలైన సినిమాల్లో ఎక్కువ రన్ టైం కలిగిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మాస్టర్ :

లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ చిత్రం 2021 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీ రన్ టైం 2 గంటల 59 నిమిషాలు ఉంటుంది. రన్ టైం ఎక్కువ అవ్వడం వలన ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. అందుకే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది.

2) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీ రన్ టైం 2 గంటల 49 నిమిషాలు ఉంటుంది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అందుకు రన్ టైం కూడా కారణమని చెప్పాలి. కానీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం.

3) సార్పట్ట :

ఆర్య హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2021 జూలైలో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం రన్ టైం 3 గంటల పైనే ఉంటుంది. కానీ ఎందుకో పెద్దగా బోర్ కొట్టదు. సాఫీగానే వెళ్ళిపోతుంది.

4) పుష్ప ది రైజ్ :

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ 2021 డిసెంబర్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 59 నిమిషాలు ఉంటుంది.మొదటి రోజు డివైడ్ టాక్ రావడానికి అదే కారణం. ఫైనల్ గా మూవీ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది.

5) అఖండ :

బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2021 డిసెంబర్లో రిలీజ్ అయ్యింది. సినిమా రన్ టైం 2 గంటల 48 నిమిషాలు ఉంటుంది. కానీ కాంబినేషన్ క్రేజ్ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

6) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ మే 12 న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రన్ టైం 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. మొదటి రోజు నెగిటివ్ టాక్ రావడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాలి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది.

7) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రన్ టైం 3 గంటల 7 నిమిషాలు. కానీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

8) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

ప్రశాంత్ నీల్- యష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రన్ టైం 2 గంటల 48 నిమిషాలు. ఈ మూవీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.

9) విక్రమ్ :

లోకేష్ కనగరాజన్.. కమల్ తో చేసిన ‘విక్రమ్’ చిత్రం రన్ టైం కూడా పెద్దదే. ఏకంగా 2 గంటల 53 నిమిషాలు మనల్ని థియేటర్లలో కూర్చోబెట్టాడు.

10) అంటే సుందరానికీ ! :

తాజాగా విడుదలైన నాని- వివేక్ ఆత్రేయ ల ‘అంటే సుందరానికీ!’ రన్ టైం ఏకంగా 3 గంటల 5 నిమిషాలు ఉంది

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus