ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

  • June 11, 2022 / 05:02 PM IST

తెలుగు సినిమా చరిత్రలో ‘గుండమ్మ కథ’ అనే చిత్రం ఓ క్లాసిక్. ఒక తోపు సినిమా అని మాస్ వర్డ్ తో చెప్పొచ్చు. తెలుగు సినిమా దిగ్గజాలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. అభిమానులకి ఫుల్ ఫీస్ట్ ఇచ్చిన సందర్భం అది. ‘గుండమ్మ కథ’ చిత్రం కథ చిన్నదే అయినా .. ఆ చిత్రాన్ని దర్శకుడు కమలాకర కామేశ్వర రావు తీర్చిదిద్దిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. రిపీటెడ్ గా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించింది.

గుండమ్మ కథ విషయానికి వస్తే.. బాగా డబ్బున్న గుండమ్మకి(సూర్యకాంతం) కి కొడుకు ప్రభాకర్ (హరనాథ్ బాబు), కూతురు సరోజ (జమున)తో పాటు సవతి కూతురు లక్ష్మీ (సావిత్రి) వారు ఉంటారు. సవతి కూతురు లక్ష్మీని పనిమనిషిలా… కూతురు సరోజని చాలా గారంగా చూసుకుంటూ ఉంటుంది గుండమ్మ. సరోజకి పెళ్లి చేయాలని భావించిన గుండమ్మ పెళ్లి కొడుకులను వెతికే పనిలో పడుతుంది. ఈ క్రమంలో గుండమ్మ ఇంటికి వచ్చిన పెళ్లి సంబంధాలన్నింటినీ పనికట్టుకుని మరీ చెడగొడుతుంటాడు కంచు గంటయ్య(రమణా రెడ్డి).

గుండమ్మకి ఈయన వరుసకి అన్నయ్య అవుతాడు. గంటయ్య కొడుకు భూపతి(రాజనాల)ని సరోజకి ఇచ్చి పెళ్లి చేస్తే గుండమ్మ ఆస్తి తన సొంతం అవుతుంది అని తన ఆలోచన.అయితే గుండమ్మ ఇంటికి పిల్లని చూడ్డానికి వెళ్లాలని రామభధ్రయ్య(ఎస్వీ రంగారావు) తన కొడుకులైన అంజి(ఎన్టీఆర్) రాజా(ఏఎన్నార్) లకు ఆదేశిస్తాడు. కానీ ఇంతలో గుండమ్మ ఇంట్లో వాళ్ళు మంచివారు కాదు అనే సమాచారం వీరికి అందుతుంది. దాంతో కొడుకులిద్దరినీ గుండమ్మ ఇంటికి వెళ్లి అసలు నిజాలు కనుక్కోమని రామ భద్రయ్య తన కొడుకులకు ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు.చివరికి గుండమ్మ మారిందా? లేదా? అనేది మిగిలిన కథ.

జూన్ 7తో ఈ చిత్రం విడుదలై 60 ఏళ్ళు పూర్తయింది. 1962 వ సంవత్సరం జూన్ 7న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే ఇప్పటి ప్రేక్షకులని కూడా అలరిస్తుంది అని చాలా మంది దర్శకనిర్మాతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో నాగార్జున, బాలకృష్ణ ఈ సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ ను డెవలప్ చేయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేదు. అది చాలా టఫ్ టాస్క్. అయితే ఇప్పటి జెనరేషన్ కు తగినట్టు ‘గుండమ్మ కథ’ ని రీమేక్ చేస్తే ఈ స్టార్లు కరెక్ట్ గా సూట్ అవుతారట. ఆ స్టార్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) త్రివిక్రమ్ శ్రీనివాస్ :

కమలాకర కామేశ్వర రావు లా ‘గుండమ్మ కథ’ ని ఇప్పటి జనరేషన్ కు చేరువయ్యేలా తీర్చిదిద్దగల సమర్ధుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి.

2) ఎన్టీఆర్ :

అంజి పాత్ర చేసిన సీనియర్ ఎన్టీఆర్ పాత్రకి… మన చినరామయ్య అయితేనే బాగా సూట్ అవుతాడు.

3) నాగ చైతన్య :

రాజా అనే పాత్రని అక్కినేని నాగేశ్వర రావు పోషించారు.. ఇప్పుడైతే మన నాగ చైతన్య చేస్తేనే ఆ పాత్రకి అందం వస్తుంది.

4) కీర్తి సురేష్ :

‘మహానటి’ తో ప్రూవ్ చేసింది కదా..! సావిత్రి గారు చేసిన లక్ష్మీ పాత్రకి కీర్తి సురేష్ కరెక్ట్ గా సెట్ అవుతుంది.

5) అనుపమ పరమేశ్వరన్ :

జమున గారు పోషించిన ఈ పాత్రకి మన అనుపమ పరమేశ్వరన్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది.

6) మోహన్ బాబు :

రామ భద్రయ్య పాత్రకి ఎస్వీ రంగారావు గారు జీవం పోశారు. ‘మహానటి’ రిఫరెన్స్ తీసుకుని మోహన్ బాబు గారు ఈ పాత్రకి కరెక్ట్ గా సూట్ అవుతారు అని చెప్పొచ్చు.

7) మురళీ శర్మ :

రమణా రెడ్డి గారి కంచు గంటయ్య పాత్రకి ఈయన అయితే కరెక్ట్ గా సూట్ అవుతారు అనేది కొందరి అభిప్రాయం.

8) ఆర్.ఎక్స్.100 కార్తికేయ :

రాజనాల.. భూపతి పాత్రకి ఇతనైతే బాగుంటుంది అని కొందరి అభిప్రాయం.

9) సుశాంత్ :

హరనాథ్ చేసిన ప్రభాకర్ పాత్రకి ‘అల వైకుంఠపురములో’ రిఫరెన్స్ తో సుశాంత్ ను తీసుకుంటే బాగుంటుందట.

10) ప్రగతి లేదా సుమ :

సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్ర.. నెవర్ రీప్లేసబుల్. కానీ సుమ లేదా ప్రగతి మాత్రమే ఈ పాత్రకి న్యాయం చేయగలరు అని కొందరి అభిప్రాయం.

11) బ్రహ్మానందం :

అల్లు రామలింగయ్య చేసిన అయ్యర్ పాత్రకి బ్రహ్మీ సూట్ అవుతారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus