బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేవి ఎప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ముఖ్యంగా వారాలు గడిచేకొద్ది హౌస్ మేట్స్ చేసిన తప్పులు కనిపిస్తుంటాయి. వాటి గురించి మాట్లాడుతూ హౌస్ మేట్స్ ఒకర్ని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. ఇది చూసే ప్రేక్షకులకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం కూడా ఇదే జరిగింది. ప్రియా ఇంకా లోబో ఇష్యూ తో హౌస్ ఒక్కసారిగా వేడెక్కింది. లోబో తన ప్రేమని సినిమా స్టోరీలాగా ఉందని, సినిమా డైలాగ్ అంటూ మాట్లాడావ్ అని నేను బాగా ఫీల్ అయ్యాను అంటూ ప్రియని నామినేట్ చేశాడు.
నామినేట్ చేయడమే కాదు, ఆవేశంతో ఊగిపోతూ మరీ ప్రియకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియ జరిగిన విషయాన్ని చెప్తూ నీకు రాంగ్ గా అర్ధమయ్యింది అని చెప్పింది. ఈ ఇష్యూ తర్వాత హౌస్ మేట్స్ ఒకరిని ఒకరు నామినేట్ చేస్కున్నారు. అయితే, ఈవారం ఏకంగా 8మంది నామినేషన్స్ లోకి రావడం, ప్రియతో జరిగిన ఇష్యూ వల్ల లోబో కి ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. లోబోని ఏకంగా 6గురు నామినేట్ చేస్తే, తర్వాత నటరాజ్ మాస్టర్, ఇంకా రవిలని ఎక్కువమంది నామినేట్ చేశారు. దీంతో ఈవారం ఏకంగా ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు.
నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, అనీమాస్టర్ లు అందులో ఉన్నారు. వీరిలో కాజల్, సిరి, సన్నీ, అనీమాస్టర్ లకి కేవలం రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఈ ఎనిమిదిమందికి ఓటింగ్ అనేది రసవత్తరంగా జరగబోతోంది. ఇందులో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.