సినిమా హిట్టా ఫట్టా అన్నది తరువాత సంగతి. ఎలాంటి సినిమా అయినా సరే ముందుగా పెట్టిన పెట్టుబడికి నాలుగు డబ్బులు రాబట్టగలిగితేనే సినిమా తీసిన వారికి మరో లైఫ్ ఉంటుంది. అయితే ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడమే రిస్క్ అనుకుంటున్న తరుణంలో ఏకంగా 8 సినిమాలు వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో సగానికి పైగా సినిమాలు ఎవరికి తెలియనివి. కనీసం ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయకుండానే కొన్నింటిని రిలీజ్ చేస్తున్నారు.
ఈ వారం 29న ఎనిమిది సినిమాలు వస్తున్నాయి. ఇక అందులో ముఖ్యంగా అందరికి తెలిసిన సినిమా యాంకర్ ప్రదీప్ నటించిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా?. ఈ సినిమాకు పాటతోనే మంచి క్రేజ్ అందుకుంది. కానీ థియేటర్స్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో తెలియదు. ఇక పవన్ ఫ్యాన్స్ మీద నమ్మకంతో జై సేన అనే సినిమా రానుంది. సునీల్, శ్రీకాంత్ ఇందులో నటించారు. ఇక అన్నపూర్ణమ్మ గారి మనవడు, అమ్మ దీవెన, ఎవరు చెప్పిన నమ్మరు, కళా పోషకులు, మిస్టర్ అండ్ మిస్, నాతో ఆట..
అనే సినిమాలు వరుసగా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా క్రాక్ కలెక్షన్స్ మాత్రం అదే ఫ్లోలో వస్తున్నాయి. మొన్న జనవరి 26రోజు కూడా ఈ సినిమా కోటి రూపాయలకు పైగా షేర్స్ అందించింది. మరి శుక్రవారం రానున్న సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్లను అందుకుంటాయో చూడాలి.