Balakrishna, Jr NTR : బాలకృష్ణ తారక్ మధ్య విభేదాలు ఉన్నాయా..?

  • June 7, 2021 / 04:05 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే చూడాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు బాగానే ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సరైన కథ దొరకకపోవడమే బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాకు అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. కొందరు స్టార్ డైరెక్టర్లు ఈ దిశగా ప్రయత్నాలు చేసినా ఆ డైరెక్టర్లు చెప్పిన కథలు పవర్ ఫుల్ గా లేకపోవడంతో ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడం లేదని సమాచారం.

కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నా ప్రస్తుతం బాలయ్య మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాయని సమాచారం. బాలయ్య, ఎన్టీఆర్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణతో కలిసి సినిమా చేస్తే ఆ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉండాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు ఓకే చెప్పారు.

మరోవైపు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటిస్తున్న బాలకృష్ణ అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ తెరపైకి వస్తే ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా చిన్న పాత్రలోనైనా నటించే అవకాశాలు అయితే ఉన్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus