టాలీవుడ్ ఒక రంగుల ప్రపంచం…అంతేకాదు…అక్కడ చీకటి కోణాలు సైతం చాలానే ఉన్నాయి…ఇప్పటికే అవకాశాలు ఇస్తాం అంటూ చాలా మంది ఆర్టిస్ట్స్ అమ్మాయిలను ఉపయోగించుకున్నారు అన్న అపవాదులు చాలానే ఉన్నాయి…అదే క్రమంలో మత్తు పదార్ధాలకు బానిసలుగా మారిన బడా బాబులూ చాలా మందే ఉన్నారు…ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్ రాకెట్ బయటపడింది. అయితే పోలీసుల కధనం ప్రకారం ఈ దాడుల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక బడా నిర్మాత సైతం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అదే క్రమంలో పోలీసులు ప్రెస్ మీట్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ డ్రగ్ రాకెట్ లో ఒక ప్రముఖ కాలేజ్ కి చెందిన స్టూడెంట్స్, అదే క్రమంలో కొందరు ఐటీ ఎంప్లాయీస్ తో పాటు ఒక ప్రముఖ బడా నిర్మాత సైతం ఈ డ్రగ్స్ తీసుకున్న వారిలో ఉన్నారని తెలిపారు. అయితే అన్నీ తెలిపిన పోలీసులు సదరు నిర్మాత పేరు మాత్రం బయట పెట్టలేదు. తనకు డ్రగ్స్ కావాలంటూ… అరెస్టైన ముఠాలోని ఓ సభ్యుడి సెల్ ఫోన్ కు ఆ ప్రొడ్యూసర్ మెసేజ్ పెట్టారట.
నిందితుల సెల్ ఫోన్ లను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. విచారణకు హాజరు కావాలంటూ సదరు నిర్మాతకు నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మరో పక్క టాలీవుడ్ సర్కిల్స్ లో ఎవరికి వారు ఎవరి ఊహలకు తగ్గట్టుగా వారు ఊహించేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సదరు నిర్మాతకు సంకెళ్లు పడటం ఖాయమన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆ నిర్మాత ఎవరన్న విషయంపైనే సర్వత్రా చర్చ సైతం జరుగుతోంది. చూద్దాం మరి ఆ ప్రభుద్దుడు ఎవరో!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.