Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్ తాజా నామినేష‌న్స్ : ఈరోజు నామినేష‌న్ ఎపిసోడ్‌తో.. హౌస్‌లో‌ గేమ్ ఛేంజ్ కానుందా..?

బిగ్‌బాస్ తాజా నామినేష‌న్స్ : ఈరోజు నామినేష‌న్ ఎపిసోడ్‌తో.. హౌస్‌లో‌ గేమ్ ఛేంజ్ కానుందా..?

  • November 30, 2020 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్ తాజా నామినేష‌న్స్ : ఈరోజు నామినేష‌న్ ఎపిసోడ్‌తో.. హౌస్‌లో‌ గేమ్ ఛేంజ్ కానుందా..?

తెలుగు బిగ్‌బాస్ ఫోర్త్‌ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. గ‌త వారం ఎంట‌ర్‌టైనింగ్ బాగానే చేసినా వీకెండ్ ఎలిమినేష‌న్ ఎపిసోడ్ మాత్రం తుస్సుమ‌నిపించారు. ముందుగా ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతాడ‌ని, అయితే ఎవిక్ష‌న్ పాస్ ఉప‌యోగించుకుని సేఫ్ అవుతాడ‌ని అంద‌రూ ఊహించారు. అవినాష్‌ను సేఫ్ చేసేందుకే ఎవిక్ష‌న్ పాస్ టాస్క్ పెట్టార‌ని, ఒక‌వేళ ఆ టాస్క్‌లో అవినాష్ ఓడిపోతే మ‌రోర‌కంగా అవినాష్‌ను సేవ్ చేసేవార‌ని సోష‌ల్ మీడియాలో ఎక్కువమంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో ఆదివారం ఎలాంటి ట్విస్టులు ఇవ్వ‌కుండా, అందరూ ఊహించిన‌ట్లే ఎవిక్ష‌న్ పాస్‌ను ఉప‌యోగించుకుని అవినాష్ ఎలిమినేష‌న్ నుండి సేవ్ అయ్యాడు. ఇక ఆ విష‌యం ప‌క్క‌న పెడితే మండే నామినేష‌న్ డే కావ‌డంతో, ఈరోజు హౌస్‌లో ర‌గ‌డ ఏ రేంజ్‌లో ఉంటుంద‌నేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మామూలుగానే నామినేష‌న్ ప్ర‌క్రియ రోజు హౌస్‌లో ర‌చ్చ‌లేపుతుంది. ఈ వారం మాత్రం మామూలు ర‌చ్చ‌, బీభ‌త్సం జ‌రిగేలా ఉందని, ఊహిచ‌ని ట్విస్టులు ఉండే చాన్స్ ఉంద‌ని బిగ్‌బాస్ ప్రేక్ష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

అస‌లు ఈ వారం నామినేష‌న్ ప్ర‌త్యేకంగా ఎందుకు ఉండ‌బోతుందో అనే దానికి విశ్లేష‌కులు త‌మ‌దైన అభిప్రాయాలు చెబుతున్నారు. గ‌త శనివారం హోస్ట్ నాగార్జున అంద‌రినీ క‌డిగిపారేసిన సంగ‌తి తెలిసిందే. సేఫ్‌గేమ్, క‌న్స‌ర్న్ గేమ్, సింప‌థీ గేమ్, బిగ్‌బాస్ ఆదేశాలు ధిక్క‌ర‌ణ ఇలా ప‌లు కార‌ణాల‌తో ఏకిపారేసి, హౌస్‌లో ఉన్న‌వారంద‌రికి దండం పెట్టి మ‌రీ ఇక‌నైన గేమ్‌ను గేమ్‌లాగే ఆడాల‌ని రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఇకముందు హౌస్‌లో ఎలాంటి క‌న్నింగ్ గేమ్స్ ఆడినా, ఎలాంటి మిస్టేక్స్ చేసినా మూల్యం చేల్లించ‌డం గ్యారెంటీ కావున‌, త‌మ‌పై ప‌డిన మ‌చ్చ‌ను తొలగించుకునే క్ర‌మంలో ఈరోజు నామినేష‌న్ ఎపిసోడ్ హాట్‌హాట్‌గా జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది.

ఈ నేప‌ధ్యంలో హౌస్‌లో ఉన్న ఏడుగురు గ‌త వారంలో జ‌రిగిన పరిణామాల‌ను దృష్టిలో పెట్టుకుని ఇత‌రుల‌ను నామినేట్ చేసే చాన్స్ ఉంది. ముఖ్యంగా హారిక ఈరోజు అభిని నామినేట్ చేసే చాన్స్ ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే గ‌త వారం ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. సొహైల్ ఈ వారం హౌస్‌లో ఉన్న అంద‌రితో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాడు.. దీంతో సోహైల్ నామినేట్ అయ్యే చాన్సెస్ చాలా త‌క్కువే అని అంటున్నారు. అలాగే అరియానాకు కూడా లాస్ట్ వీక్ పెద్ద‌గా ఇష్యూస్ ఏం లేక‌పోవ‌డంతో ఈ హాట్‌బామ కూడా నామినేట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే సొహైల్ అండ్ అరియానాలు ఇద్ద‌రు టామ్ జెర్రీల వ‌లె నిత్యం కొట్టుకుంటూ ఉంటారు, అలాగే లాస్ట్ వీక్‌లో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి క్లాష్ జ‌రిగిన నేప‌ధ్యంలో ఒక‌రిని ఒక‌రు నామినేట్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఎక్కువ‌మంది అభిప్రాయం వ‌క్తం చేస్తున్నారు. మోనాల్‌కి అఖిల్‌కి క్లాష్ ఉన్న క్ర‌మంలో ఇద్ద‌రు ఒక‌రిని ఒక‌రు నామినేట్ చేసుకోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే అభిజిత్‌ను కూడా అఖిల్ మ‌రోసారి నామినేట్ చేస్తాడ‌ని అంటున్నారు. గ‌‌తవారం అంద‌రికంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చినా.. ఎవిక్ష‌న్ పాస్ అనే ల‌క్‌తో సేవ్ అయ్యాడ‌నే పాయింట్‌లో ఎక్కువమంది అవినాష్‌ను నామినేట్ చేసే చాన్స్ ఉంది.

ఇక స్వాప్ విష‌యం తీసుకుని ఎక్కువ‌మంది ఇంటి స‌భ్యులు హారిక‌ను నామినేట్ చేసే చాన్స్ ఉంది. అలా జ‌రిగితే ట్విస్ట్ కాదు పెద్ద జోక్ అవుతుందనేది కొంద‌రి అభిప్రాయం. ఎందుకంటే ప్ర‌తిఒక్క‌రు ఆమె బెస్ట్ కెప్టెన్ అని తేల్చిన సంగ‌తి తెలిసిందే. ఇక మోనాల్ కార‌ణంగా త‌న ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిన కార‌ణంగా అభిజిత్ ఆమెను నామినేట్ చేసే చాన్స్ ఉంది. అలాగే అభి కూడా ఈసారి హారిక‌ను నామినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. మోనాల్ మాత్రం అఖిల్‌తో పాటు అవినాష్‌ను నామినేట్ చేసే చాన్స్ ఉంది. ఎందుకంటే గ‌త నామినేష‌న్స్‌లో భాగంగా అవినాష్ ఓవ‌ర్‌గా రియాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా చూసుకుంటే ఈవారంలో సొహైల్ అండ్ అరియానాలు త‌ప్పా మిగ‌తా వారు నామినేష్స్‌లో ఉండే చాన్స్ ఉంద‌ని, కొంత‌మంది మాత్రం అరియానా కూడా నామినేట్ అయ్యే చాన్స్ ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇలాగే క‌రెక్ట్‌గా జ‌ర‌గాల‌ని లేదు, మ‌నం చేసిన ఎనాల‌సిస్ నిజ‌మ‌వ్వాల‌ని కాదు కానీ, గ‌త సిట్యువేష‌న్స్‌ను బేస్ చేసుకుని వేసిన ఒక అంచ‌నా మాత్ర‌మే.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Ariyana
  • #Avinash
  • #Bigg boss

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

8 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

8 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

20 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

18 mins ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

39 mins ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

1 hour ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

2 hours ago
Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version