కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్న రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమాలో నటించమని అడిగితే కథ, క్యారెక్టర్ కూడా తెలుసుకోకుండానే సైన్ చేయడానికి టాలీవుడ్ వారు మాత్రమే కాదు, బాలీవుడ్ నటీనటులు కూడా రెడీగా ఉన్నారు. అయితే జక్కన్న మాత్రం కొత్తవారిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. బాహుబలి తర్వాత చేయనున్న మల్టీస్టారర్ మూవీ కి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. నగర శివార్లలో భారీ సెట్స్ వేసే పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ పక్కాగా కంప్లీట్ చేసిన రాజమౌళి ఆర్టిస్టుల సెలక్షన్స్ పై పడ్డారు. ఇందులో ఇప్పటి వరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు అనే విషయం ఇతర నటీనటుల గురించి అసలు తెలియదు.

మహానటి లో కీర్తి సురేష్ నటన నచ్చి ఆమెకి హీరోయిన్ గా అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారు. ఇది కూడా ఫైనల్ కాలేదు. అందుకే కీర్తి తెలుగులో ఏ సినిమాకి సైన్ చేయకుండా రాజమౌళి పిలుపు కోసం ఎదురుచూస్తోంది. ఇక మిగిలిన క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కోసం ఆడిషన్స్ చేయాలనీ రాజమౌళి ఫిక్స్ అయ్యారు. పాత్రకు తగ్గ వ్యక్తి దొరికితే అతన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో రాజమౌళి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఈ ఆడిషన్స్ ప్రకటన త్వరలోనే చేయనున్నారు. వారికి ఏ వయసు వారు కావాలో.. అన్ని వివరాలు అప్పుడే చెప్పనున్నారు. రాజమౌళి అంటే నమ్మకం, గౌరవం.. రెండూ ఉన్నాయి. అందుకే ఈ ఆడిషన్స్ కి లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయనడంలో సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus