అభిమాని రాసిన లవ్ లెటర్ ను పోస్టు చేసిన స్టార్ హీరోయిన్..!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ భూమిక చావ్లా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది ఈ హీరోయిన్. యువకుడి సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఏడాదిలో పవన్ నటించిన ఖుషీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాల్లో నటించింది.

దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ భామ.. 2007లో భరత్ ఠాకూర్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.. వారిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక కొడుకు కూడా జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రీఎంట్రీతో ప్రేక్షకులను అలరిస్తుంది. రీ ఏంట్రీ తరువాత అక్క, వదిన వంటి పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేస్తుంది. భూమిక చివరిగా తెలుగులో సీతారామం, సిటీమార్ వంటి సినిమాల్లో నటించింది.

ఇదిలా ఉంటే భూమిక భూమిక (Bhumika) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబందించిన పలు ఫొటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్టు చూసి అభిమానులు కంగుతిన్నారు. ఈ పోస్టులో ఓ అభిమాని తన భర్తకు ప్రేమలేఖ రాసి పంపినట్లు చెప్పింది. అలాగే ఆ అభిమాని నీ భార్యకు చెప్పు అన్నాడు. ఆ లేఖ తనను బాగా ఆకర్షించిందని భూమిక తెలిపింది. ప్రస్తుతం భూమిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus