Jr NTR: వార్2 సినిమాలో తారక్ అలా కనిపిస్తారా.. అవే హైలెట్ గా నిలుస్తాయా?

  • May 7, 2024 / 03:30 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR వార్2 సినిమాలో నటిస్తుండగా తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్2 సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఈ సినిమా కచ్చితంగా స్పెషల్ గా ఉంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. వార్2 సినిమాకు సంబంధించి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా తారక్ రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని వేటాడే సింహంలా తారక్ ఈ సినిమాలో కనిపిస్తారని భోగట్టా.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తారక్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని సమాచారం అందుతోంది. తారక్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమా కోసం ఒకింత భారీ బడ్జెట్ కేటాయించారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ సైతం కొత్తగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

హృతిక్ ( Hrithik Roshan) కు ధీటుగా తారక్ రోల్ ఉంటుందని హృతిక్ తారక్ కాంబో సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం. తారక్ పాత్రకు సంబంధించి నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. హృతిక్, తారక్ కాంబినేషన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే కాంబినేషన్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలకు మించి ఈ సినిమా ఉండనుందని వార్తలు వినిపిస్తుండగా ఈ సినిమా కోసం మరో 15 నెలల ఎదురుచూపులు తప్పవు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. వార్2 సినిమా 2025 సంవత్సరం ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus