తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

‘మహాత్మ’ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను దగ్గరైన హోమ్లీ బ్యూటీ భావన (Bhavana). అప్పటికే కొన్ని సినిమాలు చేసిన ఆమె అసలు కార్తిక మీనన్‌. సినిమాలతో ఆమె ఎంత పేరు సంపాదించుకుందో తెలియదు కానీ… విమర్శలు, వివాదాలతో ఇంకా ఎక్కువ వైరల్‌గా మారింది. తెలుగులో ఆమె నాలుగు సినిమాలు చేసినా మలయాళం, కన్నడ, తమిళంలో చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా మలయాళంలో చాలా సినిమాలు చేసింది. ఇటీవల కాలంలో తన జీవితంలో జరిగిన విషయాలు, ఘటనలతో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

తనకు పలుమార్లు అబార్షన్ అయింది అని కొంతమంది ప్రచారం చేశారు అని ఎమోషనల్‌గా మాట్లాడింది భావన. కొన్ని సార్లు నేను చనిపోయానని కూడా మాట్లాడారు. అంతేకాదు చాలామందితో అఫైర్ పెట్టుకున్నాను అని, బజారు మనిషిని అని కూడా నా పై పుకార్లు పుట్టించి, వ్యాపింపజేశారు అని భావన మాట్లాడింది. తన గురించి వచ్చిన ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి పుకార్ల కారణంగా తాను మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను అని కూడా చెప్పింది భావం.

ఆ పుకార్లు, మాటలు గుర్తు చేసుకుంటే చిరాకు వేస్తోందని, అయితే తాను ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నాను అని భావన చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్‌ విషయంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరు ఆ పని చేశారు అని మాట్లాడుకుంటున్నారు. తెలుగులో ఆఖరిగా 2012లో ‘నిప్పు’ (Nippu) సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన భావన.. మలయాళం, కన్నడ, తమిళంలో మాత్రం కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తోంది.

ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘పింక్‌ నోట్‌’, ‘ఉత్తరాకాండ’ అనే కన్నడ సినిమాలు రెండు ఉన్నాయి. అలాగే ‘హంట్‌’ అనే మలయాళం సినిమా సెట్స్‌ మీద ఉంది. వీటితోపాటు ‘ది డోర్‌’ అనే తమిళ సినిమాను కూడా భావన చేస్తోంది. అయితే ఎందుకో మరి తెలుగు సినిమాలు మాత్రం కొత్తవి ఓకే చేయం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus