Raghava Lawrence: వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో, కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence)  ఈ మధ్య కాలంలో వరుసగా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వికలాంగులకు బైక్స్, పేద రైతులకు ట్రాక్టర్లు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచిన లారెన్స్ తాజాగా లేడీ ఆటో డ్రైవర్లకు సహాయం చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. కొంతమంది లేడీ ఆటో డ్రైవర్లు వాహనాల రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని రాఘవ లారెన్స్ దృష్టికి వచ్చింది.

యాక్టర్ బాలన్, లారెన్స్ ఫైనాన్స్ క్లియర్ చేసి మహిళలకు అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న మహిళలకు అండగా నిలిచిన లారెన్స్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఆటోకు సంబంధించి లోన్ క్లియర్ చేసిన డాక్యుమెంట్లను లారెన్స్ స్వయంగా మహిళలకు అందజేశారు. తమ కష్టాలను తీర్చిన రాఘవ లారెన్స్ కు లేడీ ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. లారెన్స్ మాట్రం అనే ట్రస్ట్ ద్వారా రాఘవ లారెన్స్ ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

లారెన్స్ ద్వారా సహాయం పొందిన మహిళలలో ఒక మహిళ తన కొడుకుకు లారెన్స్ అని పేరు పెట్టారు. లారెన్స్ మెడలో దండ వేసి మహిళలు హారతి ఇచ్చారు. భవిష్యత్తులో లారెన్స్ మరిన్ని భారీ సహాయాలు చేయబోతున్నారని తెలుస్తోంది. రాఘవ లారెన్స్ లా మంచి మనస్సు ఉండేవాళ్లు తక్కువగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాఘవ లారెన్స్ లా మరి కొందరు సెలబ్రిటీలు సహాయం చేస్తే పేదల కష్టాలు తీరే అవకాశం అయితే ఉంటుంది.

రాఘవ లారెన్స్ రెమ్యునరేషన్ కూడా మరీ ఎక్కువేం కాదని తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఆయన సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. రాఘవ లారెన్స్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus