టాలీవుడ్ లో తన విలక్షణ నటనతో వర్మ సినిమాల్లో ఒక ఊపు ఊపిన నటుడు జెడీచక్రవర్తి. ప్రేక్షకులు ముద్దుగా గెడ్డం చక్రవర్తి అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నాయి అని అనుకున్న సమయంలో ఈ నటుడు దర్శకుడిగా మారి కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అందులో కొన్ని మంచి ఫలితాన్ని ఇచ్చాయి, మరి కొన్ని డిజాస్టర్ గా మారాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరో గారు ప్రేమ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అనుకోకుండా ఉన్నట్లుండి సింపల్ గా తన మ్యారేజ్ చేసుకున్నాడు జెడీ. ఇంతకీ వారి లవ్ స్టోరీ ఎలా స్టార్ అయ్యిందో తెలుసా…చాలా సింపల్ లవ్ స్టోరీ….ఒక్క లిప్ కిస్ పుణ్యమా అని పెళ్లైపోయింది…అదెలా అంటే…ఎప్పటినుండో హైదరాబాద్ లో మోడల్ గా షాపు ఓపెనింగులకు.. ర్యాంప్ వాకులకు.. విచ్చేస్తూ హంగామా చేస్తూ ఉండేది అనుకృతి…అదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ముందు శ్రీదేవిగా తెరాకెకించిన సినిమా ఆతరువాత”సావిత్రి”గా మార్చారుగా ఆ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే ఆ సినిమా ఏమయిందో ఏమో ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలీదు.. ఎందుకంటే ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఆ సినిమాలో సదరు సావిత్రి భర్త పాత్రలో జెడి చక్రవర్తి నటించాడట. ఆ సమయంలో ఇద్దరి మీదనా ఒక లిప్ కిస్ తీశారు మన వర్మ . ఇంకేముంది ఆ ఘాటు లిప్ కిస్ కోసం కాస్త ఘాడంగానే కష్టపడిన ఇరువురూ…ప్రేమలో మునిగిపోయారంట. అంటే ఒక్క లిప్ కిస్ వారిలో అంతటి వైబ్రేషన్స్ సృష్టించింది అన్న మాట.