Allu Arjun: బన్నీ నగ్నంగా కనిపించే సీన్ ఉండాల్సింది.. కానీ..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే భారీగానే అందుకుంది. కానీ వీకెండ్ అనంతరం సినిమా కలెక్షన్స్ చాలావరకు తగ్గుతూ వచ్చాయి. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సినిమా లో అన్నిటికంటే ఆ పాత్ర హైలెట్ గా నిలిచింది అంటూ అభిమానులు కూడా చాలా పాజిటివ్ గా కామెంట్ చేశారు.

అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం గతంలో మాదిరిగా స్క్రీన్ ప్లేతో అంతగా ఆకట్టుకోలేదని సినిమాలో మిగతా అంశాలు హైలెట్ కాలేదని కూడా కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. సుకుమార్ ఈ సినిమాలో రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమాలో అంతకుమించి అనే సీన్స్ ఉంటాయి అని వరుస ఇంటర్వ్యూలలో క్లారిటీ అయితే ఇస్తున్నాడు. ఇక సినిమా మొత్తానికి రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

అయితే ఇంకా రావాలి అని చిత్ర యూనిట్ సభ్యుల్లో ఆపకుండా ప్రమోషన్స్ లో కంటిన్యూ అయితే చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ముందుగా కొన్ని న్యూడ్ సీన్స్ కూడా అనుకున్నట్లుగా తెలియజేశారు. మొదటి భాగంలో క్లైమాక్స్ సన్నివేశాలను చాలా పచ్చిగా రాసుకున్నట్టు గా వివరణ ఇస్తూ.. ఫాహాద్ ఫజిల్ హీరో అల్లుఅర్జున్ ఇద్దరు కూడా న్యూడ్ గా ఉండాలి అని అనుకున్నారట.

కానీ అలాంటి సీన్స్ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు అని మళ్ళీ చివరి నిమిషంలో మార్చుకున్నట్లు గా దర్శకుడు వివరణ ఇచ్చాడు. అందుకే అల్లు అర్జున్ ఫాహాద్ ఫజిల్ ఇద్దరు అండర్ వేర్లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సీన్స్ కూడా జనాలకు అంతగా ఏమీ కనెక్ట్ కాలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. బన్నీ లాంటి మాస్ హీరోతో అలాంటి సింపుల్ క్లైమాక్స్ తో సినిమాను ముగించడం పెద్దగా కనెక్ట్ కాలేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus