Tamannaah Rejected Movies: వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!

2005 లో మంచు మనోజ్ హీరోగా దశరథ్ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది తమన్నా. అయితే 2007 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ చిత్రంతోనే ఈమె మంచి గుర్తింపుని సంపాదించుకుంది.తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా తమన్నా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తమన్నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు అంటే చాలా తక్కువే ఉన్నాయి.కానీ టాలీవుడ్లో అందరి స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ గా తమన్నా రికార్డు సృష్టించింది. కొన్నాళ్లుగా సీనియర్ స్టార్ హీరోయిన్ల సినిమాల్లో కూడా వరుసగా మెరుస్తుంది తమన్నా. ఇప్పటికే వెంకటేష్ తో ‘ఎఫ్2’, చిరంజీవితో ‘సైరా’ వంటి సినిమాల్లో నటించిన తమన్నా.. ఇప్పుడు ‘ఎఫ్3’ ‘భోళా శంకర్’ వంటి సినిమాల్లో మరోసారి జతకడుతుంది.

మరోపక్క నితిన్, సత్య దేవ్, సందీప్ కిషన్ వంటి కుర్ర హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ తమన్నా తన స్టార్ స్టేటస్ ను కాపాడుకుంటుంది.ఇదిలా ఉండగా.. డేట్స్ క్లాష్ వచ్చో.. లేక ఇష్టం లేకో కానీ తమన్నా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. అందులో హిట్ అయినవి ఉన్నాయి… ప్లాప్ అయినవి ఉన్నాయి. ఈరోజు తమన్నా పుట్టినరోజు కావడంతో ఆమె రిజెక్ట్ చేసిన లేదా ఆమె మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) అఖండ :

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ లో హీరోయిన్ గా ప్రగ్య కంటే ముందు తమన్నానే అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో ప్రగ్యని తీసుకున్నారు.

2) వెంకటేష్- తేజ :

వెంకటేష్- తేజ కాంబినేషన్లో ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ చిత్రం ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు నుండీ కూడా తమన్నా తప్పుకుందని సమాచారం.

3) విజయ్- మురుగదాస్ :

విజయ్- మురుగదాస్ కాంబినేషన్లో నాలుగవ చిత్రం రూపొందాల్సి ఉంది. ‘తుపాకి2’ గా ఈ చిత్రం రూపొందనుందని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని సంప్రదించగా ఆమె నొ చెప్పిందట. దాంతో కాజల్ ను ఎంపిక చేసుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది.

4) ఖిలాడి :

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్ గా తమన్నాని అనుకున్నారు. కానీ ఆ ఆఫర్ ను ఆమె నొ చెప్పింది.

5) సవ్యసాచి :

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్య సాచి’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా మొదట తమన్నాని అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో నిథి అగర్వాల్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కింది.

6) రాజు గారి గది3 :

ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట తమన్నాని అనుకున్నారు. షూటింగ్ మొదలయ్యాక ఆమె తప్పుకుంది. దాంతో అవికా గోర్ ను ఎంపిక చేసుకున్నారు.

7) నీ జతగా నేనుండాలి :

ఆషికి2 రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని సంప్రదించారు. కానీ ఆమె నొ చెప్పడంతో నజియా హుస్సేన్ ను ఎంపిక చేసుకున్నారు.

8) శివమ్ :

రామ్ హీరోగా రూపొందిన ‘శివమ్’ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో రాశీ ఖన్నాని ఎంపిక చేసుకున్నారు.

9) స్పీడున్నోడు :

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘స్పీడున్నోడు’ చిత్రంలో ముందుగా తమన్నానే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో సోనారికని ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ చిత్రంలో తమన్నా ఓ ఐటెం సాంగ్ చేయడం జరిగింది.

10) స్పైడర్ :

మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ‘స్పైడర్’ చిత్రంలో హీరోయిన్ గా మొదట తమన్నాని అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో పరిణితీ చోప్రాని ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమెను కూడా తప్పించి రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసుకున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus