‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

  • December 16, 2021 / 10:05 AM IST

మార్కెట్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి హీరోలు… హీరోల ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని వేరే భాషలో సత్తా చాటాలని దర్శకులు పాకులాడుతూ తీసేవే ఈ బైలింగ్యువల్ సినిమాలు అనుకోవడం తప్పే అయినప్పటికీ కొన్ని సినిమాల ఫలితాలని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ‘బాహుబలి’ హిట్ అయ్యింది కదా అని బైలింగ్యువల్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చాలా రూపొందాయి. కానీ అందులో ‘కె.జి.ఎఫ్’ మినహా సక్సెస్ అయ్యింది ఏమీ లేదు. మన తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే హీరోతో సంబంధం లేకుండా సినిమా చూస్తారు.

కానీ మిగిలిన భాషల్లో ప్రేక్షకుల అభిరుచి అలా ఉండదు. హీరో మనోడా కాదా? అన్నట్టు ఉంటుంది ఆ వ్యవహార శైలి. అందుకే చాలా బైలింగ్యువల్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అట్టర్ ప్లాప్ లు అయ్యాయి. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు’ అనే సామెతని నిజం చేసాయి. అయితే బాహుబలికి ముందు నుండే బైలింగ్యువల్ మూవీస్ వచ్చాయి.. అవేంటో వాటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయో తెలుసుకుందాం రండి :

1) అంతం :

నాగార్జున- రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలై ప్లాప్ గా మిగిలింది.

2)క్రిమినల్ :

నాగార్జున- మహేష్ భట్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కింది. కానీ ప్లాప్ అయ్యింది.

3) రక్షకుడు :

నాగార్జున – ప్రవీణ్ గాంధీ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందింది. దీని రిజల్ట్ కూడా సేమ్.

4)తుఫాన్ :

చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులో కూడా రూపొందింది. కానీ ఫైనల్ గా డిజాస్టర్ అయ్యింది.

5) జెండా పై కపిరాజు :

నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందింది. కానీ సినిమా ప్లాప్ అయ్యింది.

6) అనామిక :

నయనతార- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ‘కహాని’ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందింది. రెండు చోట్ల ప్లాపే..!

7) సైజ్ జీరో :

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో రూపొందింది. రెండు చోట్ల ప్లాపే.

8) స్పైడర్ :

మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో రూపొందింది. రెండు చోట్ల ఫ్లాపే.

9) నోటా :

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో రూపొందింది. కానీ రెండు చోట్లా డిజాస్టర్ అయ్యింది.

10) సాహో :

ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందింది. ఒక్క హిందీలో తప్ప మరే భాషలోనూ సక్సెస్ కాలేదు.

11)సైరా నరసింహారెడ్డి :

చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందింది. ఒక్క తెలుగులో ఎబౌవ్ యవరేజ్ అన్నట్టు పెర్ఫార్మ్ చేసినా.. మిగిలిన అన్ని భాషల్లో ఫెయిల్ అయ్యింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టాక్ తో సంబంధం లేకుండా ఘన విజయం సాధిస్తుంది. అందులో డౌట్ లేదు. మరి ‘పుష్ప’ ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘లైగర్’ వంటి సినిమాల పరిస్థితి ఏమవుతుందో..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus