ఆ తమిళ నటుడికి ఇచ్చే పారితోషికంలో సగం కూడా మనవాళ్ళకి ఇవ్వరట..!

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు. మన దగ్గర ఉన్నవాటి కంటే కూడా ఎక్కడో ఉన్నవాటి గురించే ఎక్కువ సమయం కేటాయించడం మనకు అలవాటు. మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మాటలు ఇవి. విషయం ఏంటి అంటే.. మన తెలుగులో ఎంతో మంచి నటీనటులు ఉన్నా.. వాళ్ళని పట్టించుకోరు మేకర్స్. పక్క రాష్ట్రాల సినీ నటులకి మాత్రం పెద్ద పీట వేస్తుంటారు.

అక్కడి జూనియర్ ఆర్టిస్ట్..లు, బిజీగా లేని ఆర్టిస్టులని కూడా పాన్ ఇండియా పేరు చెప్పి మన సినిమాల్లో పడేస్తున్నారు. వాళ్లందరికీ చాలా వరకు ఒక్కరే డబ్బింగ్ చెబుతారు. అయినా వాళ్ళు ‘తోపు’ అంటూ నెత్తిన పెట్టుకోవడం ఫిలిం మేకర్స్ తో పాటు ప్రేక్షకులకి కూడా అలవాటు అయిపోయింది అని చెప్పాలి. సముద్రఖని సంగతే తీసుకుందాం. ఆయన్ని తమిళ సినిమాలకి తీసుకుంటే ఒక్క రోజు కాల్ షీట్స్ కి రూ.30 వేలు పారితోషికం మాత్రమే ఇస్తుంటారట.

10 రోజుల డేట్స్ ఇస్తే రూ.3 లక్షలు అన్నమాట. అయితే తెలుగు సినిమాలకి మాత్రం సముద్రఖని ఒక రోజు కాల్ షీట్ కి రూ.6 లక్షల నుండి రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారట. అప్పుడు 10 రోజుల కాల్షీట్స్ కి రూ.60 లక్షల నుండి రూ.1 కోటి సమర్పించుకోవాలన్న మాట. అంతేకాదు స్టార్ హోటల్లో రూమ్, ఫ్లైట్ ఖర్చులు, ఆయన మేనేజర్ అండ్ టీం ఖర్చులు అదనం. సముద్రఖని (Samuthirakani) అనే కాదు..

మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ చాలా మంది పరభాషా నటీనటులకు ఇదే విధంగా పారితోషికాలు ఇచ్చిపడేస్తున్నారు. తెలుగు నటీనటులకు మాత్రం ఇలాంటి పారితోషికాలు చెల్లించడం లేదు. కనీసం వాళ్ళకి సెట్స్ లో మినిమమ్ రెస్పెక్ట్ వంటివి కూడా మనవాళ్ళు ఇవ్వరట.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus