Temper Movie: ‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!

‘రామయ్యా వస్తావయ్యా’ ‘రభస’ వంటి చిత్రాలతో డిజాస్టర్లు ఫేస్ చేసి.. రేసులో వెనుకపడ్డాడు ఎన్టీఆర్. అలాంటి టైంలో ఎన్టీఆర్ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ‘ఎన్టీఆర్ కి స్టోరీ సెలక్షన్ రావడం లేదని’ ‘ఒక్కటే తరహా కథల్ని ఎన్టీఆర్ ఎంపిక చేసుకుని డిజప్పాయింట్ చేస్తున్నాడని’ అభిమానులు సైతం డిజప్పాయింట్ అయ్యారు. అలాంటి టైంలో పూరి జగన్నాథ్ తో ఎన్టీఆర్ సినిమా ప్రకటన వస్తే.. మినిమమ్ బజ్ కూడా ఏర్పడలేదు. ఎందుకంటే పూరి జగన్నాథ్ కూడా ఆ టైంకి ప్లాపుల్లో ఉన్నాడు. అయినప్పటికీ 2015 ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమా అందరి అంచనాలను తలక్రిందులు చేసింది. ‘టెంపర్’ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఆంధ్రావాలా’ తర్వాత సినిమా అనుకున్నప్పుడు ముందుగా వేరే కథని అనుకున్నారు. అది కూడా ఎన్టీఆర్ కి నచ్చింది. కానీ తర్వాత ఎన్టీఆర్.. ఆ కథ పై దృష్టి పెట్టలేదు. తనకు వక్కంతం వంశీ ఎప్పుడో చెప్పిన లైన్ గుర్తొచ్చి.. ‘అది చేద్దామా?’ అని పూరీని అడిగాడు. అందుకు పూరీ కూడా ఓకే చెప్పడం జరిగింది.

2) ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ‘టెంపర్’ కథని ముందుగా రవితేజతో మెహర్ రమేష్ చేయడానికి రెడీ అయ్యాడు. ’14 రీల్స్’ సంస్థ ఆ ప్రాజెక్టుని నిర్మించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడటంతో… అది ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది.

3) ఈ సినిమాకి ముందుగా ‘దండయాత్ర’ ‘దయ’ అనే టైటిల్స్ అనుకున్నారు. తర్వాత ‘టెంపర్’ గా మార్చడం జరిగింది.

4) ‘టెంపర్’ సినిమా రిలీజ్ అయిన ఒకటి, రెండు వారాలకు ముందు కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ 2 సినిమాల కథలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అయితే ‘టెంపర్’ కి క్లైమాక్స్ బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి.

5) ‘టెంపర్’ కి ముందుగా దేవి శ్రీ ప్రసాద్.. ని సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ అతని కాల్ షీట్లు బిజీ లేకపోవడంతో అనూప్ రూబెన్స్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.

6) వాస్తవానికి ఎన్టీఆర్ చేసిన ‘రభస’ సినిమాకి అనూప్ సంగీత దర్శకుడిగా చేయాలి. కానీ ఎన్టీఆర్ కి మొదటి నుండి తమన్ పై నమ్మకం ఎక్కువ. అందుకే ప్రాజెక్టు మధ్యలో ‘రభస’ కి తమన్ ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేశాడు. ఇక ‘టెంపర్’ కి దేవీ నో చెప్పడంతో పూరి జగన్నాథ్ తన ఆస్థాన సంగీత దర్శకుడు అయిన అనూప్ రూబెన్స్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు.

7) ‘టెంపర్’ షూటింగ్ టైంలో నిర్మాత బండ్ల గణేష్ కి ఎన్టీఆర్ కి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అప్పటి నుండి ఇప్పటివరకు వాళ్ళ మధ్య గ్యాప్ అలానే ఉంది.

8) ‘టెంపర్’ ని ఒకే టైంలో తమిళంలో కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్. కానీ అది కుదరలేదు. కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు.

9) ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ‘టెంపర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.43 కోట్ల షేర్ ను రాబట్టింది. వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేదేమో..!

10) ‘టెంపర్’ ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఇది మొదటి 1 మిలియన్ మూవీ అయ్యింది అని చెప్పాలి.

11) బుల్లితెరపై కూడా ‘టెంపర్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటిసారి ఈ సినిమా టెలికాస్ట్ అయినప్పుడు 22 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

12) 2019 లో ‘టెంపర్’  (Temper) సినిమాని ‘అయోగ్య’ పేరుతో విశాల్ తమిళంలో రీమేక్ చేశాడు. ఈ సినిమా అక్కడ ప్లాప్ అయ్యింది. దానికి ముందు అంటే 2018లో ‘సింబా’ పేరుతో రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ సినిమా అక్కడ బాగానే ఆడింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus