Actress: అలాంటి మగాళ్ళ వల్లే అసహ్యం కలుగుతుంది.. హీరోయిన్ ఫ్రస్ట్రేషన్!

సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే అమ్మాయిలకి ఎన్నో సమస్యలు వస్తుంటాయని మీడియా ముఖంగా ఎంతో మంది నటీమణులు చెప్పుకొచ్చిన వీడియోలు ఎన్నో చూశాం. మీటూ అంటూ వాళ్ళు మీడియా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా చేసిన కామెంట్లు ఎంత సంచలనం సృష్టించాయి.. తర్వాత వాళ్ళ కెరీర్ ఎలా ఉంది అనేది కూడా అందరికీ తెలిసిన సంగతే..! ఇది పక్కన పెడితే.. ఓ నటి పబ్లిక్ ఈవెంట్లోకి వెళ్తే ఫేస్ చేసిన చేదు అనుభవాలను చెప్పి అందరికీ షాకిచ్చింది.

ఆ నటి (Actress) బెంగళూరుకి చెందిన అమ్మాయి. మొదట్లో పలు సినిమాల్లో నటించింది. అవి పెద్దగా కలిసి రాలేదు. తర్వాత ఛాన్స్ లు లేక పలు ఈవెంట్లకి హోస్ట్ గా చేస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ ఒకసారి పబ్లిక్ ఈవెంట్ కి వెళ్లిందట. అక్కడ జనాలు ఒకేసారి దూసుకురావడంతో ఈమె ఇబ్బందిగా ఫీలయ్యిందట. అక్కడి సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయలేనంతగా జనాలు గుమికూడారట. ఎలాగోలా ఆమె అక్కడి నుండి బయట పడినప్పటికీ.. ఓ వ్యక్తి ఎర్రగా చూస్తూ ఇబ్బంది పెట్టాడట.

అంతకు ముందు కూడా అతను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడట. పోనీలే అని.. అక్కడి నుండి కదిలి మీడియాతో ముచ్చటించేందుకు వెళితే.. ఆ టైంలో కూడా ఆ వ్యక్తి ఎర్రగా చూస్తూ ఇబ్బంది పెట్టాడట. పైగా ఈ నటి పల్చని చీర వేసుకుందట.. ఆమె నడుము భాగం, ఎద అందాలు బయటకు ఎక్స్పోజ్ అవుతున్న ప్లేస్ లోనే ఆ వ్యక్తి చూశాడట. అలాంటి వ్యక్తి చూపుల వల్లే సొసైటీలో ఉన్న మగాళ్లంటే చిరాకంటూ ఆ నటి ఎమోషనల్ కామెంట్లు చేసింది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus