Gaandeevadhari Arjuna Review in Telugu: గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 26, 2023 / 09:39 AM IST

Cast & Crew

  • వరుణ్ తేజ్ (Hero)
  • సాక్షి వైద్య (Heroine)
  • నాసర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమటం (Cast)
  • ప్రవీణ్ సత్తారు (Director)
  • BVSN ప్రసాద్ (Producer)
  • మిక్కీ జె మేయర్ (Music)
  • ముఖేష్ జి (యుకె) (Cinematography)

“ఎఫ్ 3” హిట్ అయినా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న “గని” ఫ్లాప్ అవ్వడంతో బాగా హర్ట్ అయిన వరుణ్ తేజ్ ఈసారి పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన “గాంధీవధారి అర్జున” చిత్రం ట్రైలర్ యాక్షన్ మూవీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో వరుణ్ సోలో హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!

కథ: అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ఎస్సే అనే ఏజెన్సీకి చెందిన ఏజెంట్. ఇండియన్ సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ (నాజర్)ను ఓ మాఫియా గ్యాంగ్ బారి నుండి లండన్ లో కాపాడడం అతని డ్యూటీ.

ఈ డ్యూటీని అర్జున్ సమర్ధవంతంగా నిర్వహించగలిగాడా? అసలు ఆదిత్య రాజ్ ఎందుకని ఇంటర్నేషనల్ మాఫియాకు టార్గెట్ గా మారాడు? అనేది “గాంఢీవధారి అర్జున” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు: ఒక హైలీ ట్రైన్ద్ ఏజెంట్ గా వరుణ్ తేజ్ లుక్స్ & బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ & చేజ్ సీక్వెన్స్ లలో వరుణ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అయితే.. క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎక్కడా ఎలివేట్ అవ్వలేదు. కథనంతో పొంతన లేని ఎలివేషన్స్ వల్ల అతడి పాత్ర పూర్తిస్థాయిలో వర్కవుటవ్వలేదు.

సాక్షి వైద్య లుక్స్ పరంగా పర్వాలేదు కానీ.. ఆమె క్యారెక్టర్ కు ఎలాంటి వెయిటేజ్ కానీ ఇంపార్టెన్స్ కానీ లేకపోవడం వల్ల ఆమె పాత్ర పెద్దగా పండలేదు.

తమిళ నటుడు వినయ్ రాయ్ & నాజర్, రవివర్మ తదితరులు తమ రెగ్యులర్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమా షూటింగ్ దాదాపుగా ఫారిన్ కంట్రీలో జరగడం వలన.. లైటింగ్, టింట్ హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి. అలాగే.. యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది. మిక్కీ జె.మేయర్ పాటలు వరకూ పర్లేదు కానీ.. నేపధ్య సంగీతంతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా.. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తో చేసిన బీజీయమ్ చాలా సన్నివేశాలకు సింక్ అవ్వలేదు. మిక్కీ ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ఇస్తే సినిమాకి హెల్ప్ అయ్యేది.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక స్లిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “గాంఢీవధారి అర్జున” చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్న తపన ఉన్నా.. ఆ ప్రయత్నంలో నిక్కచ్చితత్వం లోపించింది. మరీ ముఖ్యంగా.. యాక్షన్ కంటే ఎమోషన్ & సెంటిమెంట్స్ ఎక్కువవ్వడంతో సినిమా జోనర్ ఎటూ కాకుండా మిగిలిపోయింది. అలాగే.. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు తన మార్క్ ను ఈ సినిమాలో ఎక్కడా చూపించుకోలేకపోయాడు.

విశ్లేషణ: యాక్షన్ ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులు సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువవ్వడం, సమవుజ్జీ అయిన విలన్ లేకపోవడం, ఎలివేట్ చేసే నేపధ్య సంగీతం లేకపోవడం వంటి కారణాలుగా నిరాశ చెందుతాడు. ఎమోషన్ తగ్గించి పూర్తిస్థాయి యాక్షన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉంటే మాత్రం మంచి విజయం సాధించి ఉండేది.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus