ఆ మిడ్ రేంజ్ హీరో సినిమా వెనుక ఇంత కథ జరిగిందా.. దాని పరిస్థితేంటో..!

  • December 11, 2023 / 08:00 PM IST

అతనొక మిడ్ రేంజ్ హీరో. మార్కెట్ కూడా అంతంత మాత్రమే అతని సినిమాలకి..! అయితే మొన్నామధ్య ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అతని మార్కెట్ కి ఐదింతలు కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సినిమా. అటు తర్వాత వచ్చిన సినిమా ఎలాగూ ప్లాప్ అయ్యింది. అది వేరే సంగతి. అయితే ఆ హీరోగారి మార్కెట్ ను డబుల్ సినిమా కంటే.. ముందుగా మరో పెద్ద ప్రాజెక్టు మొదలైంది.

త్వరలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. వాస్తవానికి ఆ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదు అనుకున్నారు. కానీ సడన్ గా రిలీజ్ డేట్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది పీరియాడికల్ కథాంశంతో రూపొందిన మూవీ. కథ వేరే రైటర్ ది..! కానీ అతనికి దర్శకుడిగా అనుభవం లేకపోవడంతో ఓ యంగ్ డైరెక్టర్ ని తీసుకున్నాడు ఈ సినిమాని నిర్మిస్తున్న బడా నిర్మాత.

కానీ షూటింగ్ స్టార్ట్ చేసి కొంత భాగం ఫినిష్ చేశాక, (Director) ఆ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెడింది. డైరెక్టర్ కూడా షూటింగ్లకి ఎగ్గొట్టేవాడు. దీంతో సదరు నిర్మాత విసుగు చెంది డీవోపీతో డైరెక్షన్ చేయించాడు. అలా అని అతని పేరు వేయడం లేదు. తన పేరే డైరెక్టర్ గా వేసుకుంటున్నాడు. దీంతో హీరోకి కూడా ఈ సినిమా పై ఇంట్రెస్ట్ పోయింది.

అయినా తన వరకు తాను ప్రమోషన్ చేసి వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. అన్నట్టు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని.. సదరు నిర్మాత ఓ సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. ఇంత జరిగాక అది అసంభవమనే చెప్పాలి. మొత్తంగా ప్లానింగ్ కరెక్ట్ గా లేకపోతే.. సినిమా పరిస్థితి ఇలాగే తయారవుతుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus