పాపం.. ఓ యాంకర్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ లైన్ చెప్పగానే చాలా మందికి క్లారిటీ వచ్చేసి ఉండవచ్చు. నిన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ తరఫున ప్రచారంలోకి దిగింది ఓ యాంకర్. కేవలం ఆ పార్టీకి ప్రచారం చేసుకుని.. తర్వాత సైలెంట్ అయిపోతే బాగానే ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు. బహుశా.. అధికార పార్టీ రిక్వైర్మెంట్ వల్లో ఏమో కానీ.. ప్రత్యర్థి పార్టీ అధినేత పై ఆమె నోరు పారేసుకుంది.
ఆయన ఓడిపోవడం ఖాయమని కామెంట్లు చేసింది. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో ఆమె ఓ పిట్ట కథ చెబుతూ.. ఆ పార్టీ అధినేతని మరింత కించపరిచింది. అయితే ఎన్నికల రోజున ఆ పార్టీ హవా గురించి తెలుసుకుని ఆమె షాకైపోయిందట. దీంతో ఇండస్ట్రీలో ఉన్న న్యూట్రల్ పీపుల్ తో ఈ విషయం గురించి చర్చించిందట. వారందరూ ‘మీరు కొంచెం ఎక్కువగానే మాట్లాడారు. అధికార పార్టీ గెలిచినా.. ఇండస్ట్రీని రూల్ చేసే కుటుంబాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వాళ్ళు మీ కెరీర్ ను డిస్టర్బ్ చేసినా.. చేయకపోయినా.. వాళ్ళతో సినిమాలు చేసే ఫిలిం మేకర్స్ మిమ్మల్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది. అది వెండితెరపై అయినా బుల్లితెరపై అయినా..!’ అంటూ వివరణ ఇచ్చారట. దీంతో ఆ యాంకర్లో టెన్షన్ మరింత పెరిగిపోయిందట. ఈ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్స్ లో కొంతమందికి ఫోన్ చేసి చెప్పి.. ఓదార్పు కోరుకుంటుందట ఆ యాంకర్.