విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47). శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థపై సూర్య దేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన కొత్తలో.. మంచి హైప్ ఉండేది. అయితే సినిమా అనేక సార్లు వాయిదా పడటం వల్ల.. జనాల్లో ఆసక్తి తగ్గింది.
మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. 2వ రోజు కొన్ని ఏరియాల్లో మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది.3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 8.43 cr |
| సీడెడ్ | 1.93 cr |
| ఉత్తరాంధ్ర | 1.98 cr |
| ఈస్ట్ | 1.01 cr |
| వెస్ట్ | 0.92 cr |
| కృష్ణా | 1.24 cr |
| గుంటూరు | 1.13 cr |
| నెల్లూరు | 0.78 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.42 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.08 cr |
| ఓవర్సీస్ | 6.25 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 26.75 cr (షేర్) |
‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరోవైపు భారీ వర్షాలు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్లో రూ.26.75 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.51 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.34.25 కోట్లు కలెక్ట్ చేయాలి.