Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం..’ (Aadarsha Kutumbam AK 47) సినిమా రూపొందింది. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. 2 సార్లు రిలీజ్ పోస్ట్-పోన్ అయ్యింది కూడా..! టీజర్ మినహా ప్రమోషనల్ కంటెంట్ ఏమీ ఆకట్టుకోలేదు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండీ ఫస్ట్ సింగిల్ గా ‘నారాయణమ్మా’ అనే సాంగ్ వచ్చింది. దానికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ గా ‘మాలా’ అనే పాట వచ్చింది.

Aadarsha Kutumbam AK 47

వెంకటేష్ శ్వాగ్, హీరోయిన్ నివేదా పేతురాజ్ గ్లామర్ ఈ పాటకి అట్రాక్షన్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ మంచి విజువల్స్ అందించారు. పాట కోసం వేసిన సెట్ కూడా బాగుంది. కానీ తమన్ ట్యూన్ పూర్తిగా తేడా కొట్టేసింది. ఈ పాట వింటుంటే ఎటువంటి వైబ్ రావడం లేదు, పైగా ఎక్కడో పాత క్యాసెట్ ప్లే అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తమన్ ట్యూన్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ రావడం కొత్తేమీ కాదు. కానీ ఈ ‘మాలా’ పాట వింటుంటే చాలా ‘టేక్ ఇట్ గ్రాంటెడ్’ గా తీసుకున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

‘లెట్స్ క్రష్ ది ఫ్లోర్’ అంటూ ఇంగ్లీష్ కోరస్‌తో మోడ్రన్ గా మొదలైన ఈ పాట అసలు గుట్టు కాస్త ముందుకు వెళ్లాక బయటపడుతుంది. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ‘ఓ బావ’ పాటని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు. ‘ఎంత హ్యాండ్సమ్ లే మా బావా’ మీటర్, ఆ ఫాస్ట్ బీట్ డ్రమ్స్, ఆ ఫ్లో… అచ్చు గుద్దినట్టు ‘మాలా’ ట్రాక్ లోకి దిగిపోవడం షాకిచ్చే అంశం. సినిమా వాయిదా పడటంతో, బజ్ తగ్గకుండా చూసుకోవాలంటే మేకర్స్ కి కొంచెం ఇన్స్టా రీల్స్ మెటీరియల్ అవసరం. అందుకే ఈ పాటని దించారు.

తమన్ కి టైం కూడా లేకపోవడంతో ఆల్రెడీ హిట్టయిన పాత ‘ఓ బావా’ స్టైల్లో ఓ పాటని కంపోజ్ చేసి వదిలేశాడు. సాధారణంగా దర్శకుడు త్రివిక్రమ్ కూడా మ్యూజిక్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. కానీ ఆయన కూడా లైట్ తీసుకున్నట్టు ఉన్నారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా చాలా డబుల్ మీనింగ్ తో ఉన్నాయి. ఇక ఈ పాట సినిమా ప్రమోషన్ కి ఎంత వరకు కలిసొస్తుందో.. మేకర్స్ కే తెలియాలి. మీరైతే ఒకసారి చూస్తూ వినండి :

మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus