ఘనంగా ఆది పినిశెట్టి తల్లి పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఆది విలన్ నటిస్తున్నాడు అంటే ఆ పాత్ర సినిమాలో చాలా ప్రాముఖ్యమైనది అయ్యుంటుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ‘సరైనోడు’ ‘అజ్ఞాతవాసి’ ‘ది వారియర్’ వంటి సినిమాల్లో ఆది విలన్ గా నటించాడు. ఆ సినిమాల్లో హీరోల పాత్రలకు ధీటుగా ఆది పాత్ర ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక రంగస్థలం, నిన్నుకోరి వంటి చిత్రాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసి ఆకట్టుకున్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిన సంగతే. ఆది ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకు అన్న సంగతి తెలిసిందే. ఆది అన్న సత్య ప్రభాస్ కూడా దర్శకుడే. మలుపు అనే చిత్రాన్ని ఇతనే డైరెక్ట్ చేసాడు. ఇక ఈ ఏడాది హీరోయిన్ నిక్కీ గల్రాని ని పెళ్లి చేసుకున్నాడు.ఈమె టాలీవుడ్ హీరోయిన్ సంజనా గల్రాని చెల్లెలు అన్న సంగతి తెలిసిందే.

ఆది- నిక్కీ లది లవ్ మ్యారేజ్.కొంతకాలం ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అతను ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఆది తల్లి రాధా రాణి పుట్టినరోజు వేడుకను ఆది ఫ్యామిలీ సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus