ఒకప్పుడు కన్నడ సినిమా అంటే సౌత్ లో చాలా చిన్న చూపు ఉండేది. మలయాళం ఇండస్ట్రీ చిన్న మార్కెట్ అయినా.. దానికంటే కూడా కన్నడ పరిశ్రమను తక్కువ చేసి చూసేవారు. ఎందుకంటే కన్నడంలో దాదాపు రీమేక్ సినిమాలే రూపొందుతాయి.రూ.5 కోట్ల బడ్జెట్ లోనే సినిమాలు తెవిల్చేసేవారు. అవసరమైతే ఒరిజినల్ సినిమాలోనే షాట్స్ ను చాలా వరకు వాడేసుకునేవారు. వాళ్లకు ఓ సినిమా నచ్చితే రైట్స్ కూడా కొనుగోలు చేసుకోకుండా రీమేక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ నుండి కన్నడ సినిమా అంటే అందరికీ రెస్పెక్ట్ పెరిగింది అనే చెప్పాలి.
తక్కువ బడ్జెట్ లో తీసినా అక్కడి సినిమాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నాయి. పైగా రీమేక్ సినిమాలు తగ్గించుకుని ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నడలో రూపొందిన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1250 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
2) కాంతార :
రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి దూసుకుపోతుంది.
3) కె.జి.ఎఫ్ చాప్టర్ 1 :
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
4) విక్రాంత్ రోణ :
కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.155 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
5) జేమ్స్ :
పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేతన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
6) 777 చార్లీ :
రక్షిత్ శెట్టి హీరోగా కిరణ్ రాజ్.కె దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.110 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
7) రాబర్ట్ :
దర్శన్ హీరోగా తరుణ్ సుధీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.102 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
8) కురుక్షేత్ర :
దర్శన్, అర్జున్ సార్జా వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ పౌరాణిక చిత్రాన్ని నాగన్న డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
9) రాజకుమార :
పునీత్ రాజ్ కుమార్ హీరోగా సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
10) ముంగరు మాలె :
గణేష్ హీరోగా నటించిన ఈ మూవీకి యోగ్రాజ్ భట్ దర్శకుడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.