Yashoda Review: యశోద సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఉన్ని ముకుందన్ (Hero)
  • సమంత (Heroine)
  • వరలక్ష్మి శరత్ కుమార్ (Cast)
  • హరి-హరీష్ (Director)
  • శివలెంక కృష్ణప్రసాద్ (Producer)
  • మణిశర్మ (Music)
  • ఎం.సుకుమార్ (Cinematography)
  • Release Date : నవంబర్ 11, 2022

తెలుగు లేడీ సూపర్ స్టార్ సమంత టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “యశోద”. పలు తమిళ చిత్రాలు తెరకెక్కించిన దర్శకద్వయం హరి-హరీష్ ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ భారీ అంచనాల నడుమ నేడు (నవంబర్ 11) విడుదలైంది. సరోగసీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: బిజినెస్ మేన్ శివ్ రెడ్డి హత్య చేయబడతాడు. అతడి హత్య సిటీలో కలకలం రేపుతుంది. అదే తరుణంలో యశోద (సమంత) డబ్బు కోసం సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి ఒప్పుకొని మధు (వరలక్ష్మి శరత్ కుమార్) సీక్రెట్ గా మైంటైన్ చేస్తున్న ఓ హాస్పిటల్ కమ్ ల్యాబ్ కి షిఫ్ట్ చేయబడుతుంది.

ఇక్కడ మొదలవుతుంది అసలు కథ.. ఓ పక్క శివ్ రెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా, మరోపక్క ఆ ఫెసిలిటీలో సరోగేట్ మదర్స్ మీద జరుగుతున్న ప్రయోగాలు యశోదకు అనుమానం కలిగిస్తాయి.

ఆ ఫెసిలిటీ నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో అక్కడ జరుగుతున్న దారుణాల గురించి, మధు గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలుసుకుంటుంది యశోద.

అసలు యశోద ఎవరు? ఎందుకని సరోగసీకి అంగీకరించి ఫెసిలిటీలోకి అడుగుపెట్టింది? మధు ఎవరు? వీళ్ళకు బయట జరిగిన బిజినెస్ మ్యాన్ హత్యకు సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “యశోద” చిత్రం.

నటీనటుల పనితీరు: సమంత మంచి నటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ.. ఈ చిత్రంలో గర్భవతిగా అమ్మతనాన్ని మోస్తూ.. ధీరవనితగా తెగువని చూపే తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లేడీస్ ఆమె క్యారెక్టరైజేషన్ కు బాగా కనెక్ట్ అవుతారు. పాత్రకు చివర్లో ఇచ్చిన జస్టిఫికేషన్ బాలేదు కానీ.. ఆ పాత్రను సమంత పోషించిన విధానం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆమె బాడీ లాంగ్వేజ్ & మ్యానరిజమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ చినిగిపోయే పాత్రలో అదరగొట్టింది. ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ & డబ్బింగ్ మధు క్యారెక్టర్ కు మెయిన్ హైలైట్స్. ఆ పాత్రలో ఆమె జీవించేసిందనే చెప్పాలి.

డాక్టర్ గా ఉన్ని ముకుందన్ ఆకట్టుకున్నాడు. సమంత & ఉన్ని ముకుందన్ కాంబినేషన్ సీన్స్ క్యూట్ గా వర్కవుటయ్యాయి.

రావురమేష్, సంపత్ రాజ్, శతృ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

సాంకేతికవర్గం పనితీరు: నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన నేపధ్య సంగీతం ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ & ఆర్ట్ వర్క్ బాగా ఎలివేట్ అయ్యాయి. యాక్షన్ బ్లాక్స్ ను ప్లేస్ చేసిన విధానం కూడా బాగుంది.

దర్శకద్వయం హరి-హరీష్ లు కథను రాసుకున్న విధానం బాగున్నా.. కథనం విషయంలో మాత్రం తేలిపోయారు. ఇంటర్వెల్ బ్లాక్ వరకూ పకద్భంధీగా ఉన్నా.. తర్వాత ఏమిటనేది క్లారిటీ లేకుండా పోయింది. అలాగే.. సినిమాకి చాలా కీలకమైన సమంత క్యారెక్టర్ ట్విస్ట్ ను ఎలివేట్ చేసిన విధానం వేరే సినిమాల రీతిలో ఉండడం మైనస్ గా మారింది. ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. తక్కువ బడ్జెట్లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

విశ్లేషణ: సమంత నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. హరి-హరీష్ లు కథనం విషయంలో జాగ్రత్త వహించకపోవడంతో మంచి స్కోప్ ఉన్న “యశోద” యావరేజ్ గా మిగిలిపోయింది. అయితే.. సమంత కష్టం, ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & ఆమె వీరోచితంగా చేసిన పోరాట సన్నివేశాల కోసం హ్యాపీగా ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

Click Here To Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus