నచ్చక పోతే నా సినిమాలు చూడకండి:ఆది
- February 18, 2016 / 10:51 AM ISTByFilmy Focus
టాలీవుడ్ విలక్షణ నటుడు, డైలాగు కింగ్ సాయికుమార్ తనయుడు యంగ్ హీరో ఆది ‘ప్రేమ కావాలి’ చిత్రంతో వెండితెర ప్రేక్షకులకు పరిచయమైన ఆ చిత్ర విజయం తర్వాత ఇప్పటివరకు సరైన హిట్ ని సాధించలేక పోయిన హీరో ఆది తను నటించిన ‘గరం’ చిత్రంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా ఆది, అదాశర్మ జంటగా నటించిన ‘గరం’ చిత్రం ఈ నెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమాపై ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘తాను నటించిన ‘గరం’ చిత్రం ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కొట్టించదని, ఈ చిత్రం మాత్రం ఫ్యామిలీలను ఆకట్టుకుంటుందని నేను కచ్చితంగా చెప్పగలనని’ ఆది తెలిపాడు.
గరం చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాలు చాలా సెంటిమెంట్ తో ఉంటుందని, కచ్చితంగా ప్రేక్షకులు ఆ సన్నివేశాలకు కనెక్ట్ అవుతారని తెలిపాడు. ఈ చిత్రం చూసిన తర్వాత ఎవరైనా నిరాశ చెందితే ఇక తన చిత్రాలను చూడవద్దని ఆది చెప్పుకొచ్చాడు. కాని విడుదలైన తర్వాత ఈ చిత్రం మిక్స్డ్ రిసల్ట్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. చిత్రంపై ఎంతో నమ్మకంతో ఉన్న ఆది ఇటువంటి కామెంట్స్ చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















