Aamir Khan, Sanju movie: ఆమిర్‌తో రాజ్‌కుమార్‌ హిరానీ ఆ పాత్ర చేయించాలనుకున్నారా!

Advertisement

అదేంటి… ‘సంజూ’ లాంటి సినిమాను ఆమిర్‌ ఖాన్‌ వదులుకున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజం… ఈ విషయం ఆయన చెప్పినదే. అయితే ఇందులో లింక్‌ ఉంది. ఆమిర్‌ ఖాన్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ అప్రోచ్‌ అయ్యింది సంజయ్‌ దత్‌ పాత్ర కోసం అనుకునేరు. ఆ పాత్ర కోసం అయితే ఒప్పుకునేవారేమో. కానీ రాజ్‌కుమార్‌ హిరానీ చేయమని అడిగింది… సంజయ దత్‌ తండ్రి పాత్ర అట. ఇంతకీ ఏమైందంటే… బాలీవుడ్‌లో కాంట్రవర్సీకి కేరాఫ్‌ ఎడ్రస్‌గా, వెరైటీకి మారుపేరుగా నిలిచిన నటుడు సంజయ్‌ దత్‌.

ఆయన జీవిత కథగా ‘సంజూ’ అనే సినిమా మూడేళ్ల క్రితం వచ్చింది. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌గా రణ్‌బీర్‌ కపూర్‌ అదరగొట్టేశాడు. సంజూ తండ్రి సునీల్‌ దత్‌ పాత్రలో పరేశ్‌ రావల్‌ నటించాడు. అయితే నిజానికి ఆ పాత్రలో ఆమిర్ ఖాన్‌ నటించాల్సింది. అయితే ఆమిర్ మనసులో సంజయ్‌దత్‌ పాత్ర పోషించాలని ఉండిందట. అప్పటికే రణ్‌బీర్‌ కపూర్‌ ఆ పాత్రకు ఓకే అయిపోవడంతో అడగలేదట. అలాగే సునీత్‌ దత్‌ పాత్ర కూడా చేయలేదట.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే… సంజూ పాత్ర కోసం మొదట అనుకున్నది రణ్‌బీర్‌ కపూర్‌ని కాదట. ఆ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌తో సినిమా చేయిద్దామని నిర్మాత విధు వినోద్‌ చోప్రా అనుకున్నారట. అయితే.. రణ్‌బీర్‌ కపూర్‌ అయితేనే సంజూ పాత్రకు బాగా నప్పుతాడని దర్శకుడు రాజ్‌కుమార్‌ ఒప్పించారట. అలా సంజూ భాయ్‌గా రణ్‌బీర్‌ తెరపైకి వచ్చాడు. మరి రణ్‌వీర్‌ సింగ్‌, ఆమిర్ ఖాన్ ఆయా పాత్రల్లో నటించుంటే ఇంకెలా ఉండేదో మరి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus