నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

డేటింగ్ అనే పదం మొదట్లో వినడానికి ఒకింత ఆశ్చర్యంగా, విడ్డూరంగా అనిపించినా.. ఇప్పుడది అది చాలా కామన్ అయిపోయింది. మొదట్లో బాలీవుడ్లో మాత్రమే డేటింగ్ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు వినిపించేవి.మెల్లమెల్లగా అది కోలీవుడ్, టాలీవుడ్లో కూడా ఫేమస్ అయిపోయింది. అయితే డేటింగ్ లో ఉన్న జంటలు.. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉండేది. మరికొన్ని జంటలు బ్రేకప్ అయిపోయేవి. కానీ కొన్ని జంటలు మాత్రం ఏళ్ళకు ఏళ్ళు డేటింగ్ చేస్తూనే ఉన్నాయి. మరి వారి ఫైనల్ డెస్టినేషన్ ఏంటా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి ఆ మోస్ట్ ఎలిజిబుల్ డేటింగ్ కపుల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) నయనతార :

ఈమె చాలా కాలం నుండీ దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉంది. నిత్యం వీళ్ళు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వీళ్ళ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. కానీ ఆ విషయం పై వీళ్ళు నోరు మెదపడం లేదు. ఓ పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క డేటింగ్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నారు.

2)దిశా పాటనీ :

ఈమె చాలా కాలంగా టైగర్ ష్రాఫ్ తో డేటింగ్లో ఉంది. వీళ్ళు కొన్నేళ్లుగా విచ్ఛల విడిగా తిరిగేస్తున్నారు. పెళ్లి ఊసు మాత్రం లేదు.

3)ఐరా ఖాన్ :

ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ తో హ్యాపీగా డేటింగ్ చేసుకుంటుంది. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. పెళ్లి సంగతేంటి అంటే.. జాన్ తా నయ్ అంటూ సమాధానం ఇస్తుంది.

4)కియారా అద్వానీ :

కియారా అద్వానీ చాలా కాలం నుండీ సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉంది. చాలా సార్లు వీళ్ళు మీడియా కంట్లో పడ్డారు. పెళ్లి గురించి అయితే ఇప్పట్లో వీళ్ళు ఆలోచించే అవకాశం లేదు.

5)అవికా గోర్ :

టాలివుడ్ హీరోయిన్ అవికా.. కొన్నాళ్ల నుండీ మిలింద్ చద్వానితో ప్రేమలో ఉంది. అతను ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటుంది. కానీ మిలింద్ ఎప్పుడు ఓకే చెబుతాడో..!

6)అలియా భట్ :

ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ అలియా.. రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉంది. వీళ్ళ పెయిర్ కు చాలా క్రేజ్ ఉంది. కానీ పెళ్లి గురించి మాత్రం ఈ జంట ఆలోచించడం లేదు.

7)మలైకా అరోరా :

తనకంటే చిన్న వాడైనా అర్జున్ కపూర్ తో చాలా కాలం నుండీ ప్రేమలో ఉంది ఐటెం బాంబ్ మలైకా. కానీ పెళ్ళి చేసుకోవడానికి మాత్రం వీళ్ళు ముందడుగు వేయడం లేదు.

8) కత్రినా కైఫ్ :

ఈమె చాలా కాలంగా స్టార్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉంది. వీళ్ళు చాలా సార్లు మీడియా కంట పడ్డారు. కానీ పెళ్ళి చేసుకోవడానికి మాత్రం వీళ్ళు సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది.

9) మెహ్రీన్ పీర్జాడ :

చాలా కాలంగా ఈమె భవ్య బిష్ణోయ్ తో డేటింగ్ లో ఉంది. రీసెంట్ గా వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ పెళ్ళికి వీళ్ళు ఇంకా టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

10) శృతీ హాసన్ :

ప్రస్తుతం సంతాను హజారికా అనే వ్యక్తితో డేటింగ్ లో ఉంది శృతీ. ఈ విషయాన్ని వీళ్ళు భహిరంగంగానే తెలియజేసారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus