విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

  • June 28, 2021 / 10:00 PM IST

రాజమౌళి తండ్రిగా..మరియు ఆయన సినిమాలకు కథలు అందించే రైటర్ గా మాత్రమే విజయేంద్ర ప్రసాద్ గారు మనకు తెలుసు. అయితే రాజమౌళి ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు నుంచే ఈయన స్టార్ రైటర్ స్థానాన్ని సంపాదించుకున్నారు అన్న సంగతి బహుశా చాలా తక్కువ మందికే తెలిసుండొచ్చు ..! గతంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు.అందులో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమాలు కూడా ఉండడం విశేషం..!అంతేకాదు ఈయన డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు చేశారు. విజయేంద్ర ప్రసాద్ గారి గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మరిన్ని తెలుసుకుందాం రండి :

1) ఈయన పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్.విజయేంద్ర ప్రసాద్ గారు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 35 ఏళ్ళు పూర్తి కావస్తోంది.ఇప్పటి వరకూ ఆయన అన్ని భాషల్లో కలుపుకుని 27 సినిమాలకు రైటర్ గా పనిచేసారు.

2)1988 లో కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన ‘జానకి రాముడు’ చిత్రంతో విజయేంద్ర ప్రసాద్ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకి ఈయన రైటర్ గా పనిచేసారు. అక్కినేని నాగార్జున, విజయశాంతి.. ఇందులో హీరో,హీరోయిన్స్..!

3)అటు తర్వాత..

బొబ్బిలి సింహం
బంగారు కుటుంబం
ఘరానా బుల్లోడు
సరదా బుల్లోడు
యువరత్న రాణా
సమరసింహా రెడ్డి
సింహాద్రి
సై
విజయేంద్ర వర్మ
నా అల్లుడు
ఛత్రపతి
విక్రమార్కుడు
యమదొంగ
మిత్రుడు
మగధీర
బాహుబలి ది బిగినింగ్
బజరంగీ భాయ్ జాన్
జాగ్వార్
బాహుబలి 2
మెర్సల్( తెలుగులో ‘అదిరింది’) — వంటి చిత్రాలకు రైటర్ గా పనిచేసారు విజయేంద్ర ప్రసాద్ గారు.
మణికర్ణిక(హిందీ)

4)త్వరలో రాబోతున్న ‘తలైవి’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు కూడా విజయేంద్ర ప్రసాద్ గారే రచయితగా పని చేస్తుండడం విశేషం.

5) ఇక దర్శకుడిగా..

అర్ధాంగి
శ్రీకృష్ణ 2006
రాజన్న
శ్రీవల్లి …. వంటి చిత్రాలను తెరకెక్కించారు విజయేంద్ర ప్రసాద్..!

6) విజయేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో.. రాజమౌళి గారి సూచన మేరకు డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నారు.

7) ప్రభాస్ నటిస్తున్న స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ కు కూడా రైటర్ గా పనిచేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని టి.సిరీస్ వారు నిర్మిస్తుండగా.. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

8) విజయేంద్ర ప్రసాద్ గారు కథలు అందించిన సినిమాల్లో.. 5 ఇండస్ట్రీ హిట్లు ఉండడం విశేషం.

9)దర్శకధీరుడు రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం’ స్క్రిప్ట్ పై చాలా కాలం నుండీ ఈయన పనిచేస్తున్నారు.

10) ఇటీవల కరోనా బారిన పడిన విజయేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్యనే కోలుకున్నారు. తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో తెరకెక్కనున్న మరిన్ని పెద్ద ప్రాజెక్టులకు ఈయన రైటర్ గా పని చేయబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus