ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!

సినిమాకి సంబంధించి ఏ వేడుక ఏర్పాటు చేసినా అది క్యాస్ట్ అండ్ క్రూని పొగుడుతూ ఆ సినిమాకి హైప్ కు తీసుకురావడం కోసమే. ఇది ఏమాత్రం కవర్ చెయ్యాల్సిన అవసరం లేని నిజం. అవార్డుల వేడుకల్లో కూడా తమ సినిమా కోసమే మాట్లాడుతూ ఉంటారు సెలబ్రిటీలు. వాళ్ళ పనే అది. దాని కోసం మాట్లాడటం మిగిలిన వాళ్లకు అతి అనిపించొచ్చు కానీ..! అందులో ఎంత మాత్రం తప్పు లేదు. అయితే కొన్ని సినిమా వేడుకల్లో సెలబ్రిటీలు ఇచ్చిన స్పీచ్ లు మన మైండ్లో నుండీ డిలీట్ చేసెయ్యాలని ఎంత ట్రై చేసినా డిలీట్ చెయ్యలేము. మనకి తెలీకుండానే అవి మన మైండ్లో రికార్డు అయిపోయి.. రిపీట్స్ వేసుకుంటూ ఉంటాయి. అలాంటి 10 స్పీచుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం :

1) పాటల రచయిత సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి గురించి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్. దీని గురించి ఇంకో 10 జనరేషన్లు కూడా మాట్లాడుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

2)’టెంపర్’ ఆడియో లాంచ్ లో అభిమానులకు ఎన్టీఆర్ సారి చెబుతూ… మీరు కాలర్ ఎగరేసుకునే సినిమాలే చేస్తాను అని హామీ ఇస్తూ చెప్పిన మాటలు మనం ఎప్పటికీ మరచిపోలేము. ఆ స్పీచ్ కు తగినట్టుగానే సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తారక్.

3)’నాన్నకు ప్రేమతో’ ఆడియో లాంచ్ లో సుకుమార్ ఇచ్చిన స్పీచ్. ‘నాన్న’ గొప్పతనం గురించి ఆయన చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరినీ ప్రశ్నిస్తాయి. తండ్రి పై కోపం వచ్చినప్పుడు ఈ స్పీచ్ వింటే నెగిటివ్ ఫీలింగ్స్ పోతాయి.

4) ‘బాహుబలి2’ ప్రీ రిలీజ్ వేడుకలో కీరవాణి గారు ఇచ్చిన స్పీచ్. దీనికి రాజమౌళి కూడా కన్నీళ్లు పెట్టేసాడు. చిన్నవాడివి కాబట్టి పొగడకూడదు అందుకే దీవిస్తున్నాను అంటూ ఆయన చెప్పిన మాటలు అమృతం తగినట్టు అనిపిస్తాయి.

5) ‘డియర్ కామ్రేడ్’ లో రష్మిక మందన స్పీచ్ కూడా సూపర్. హీరోయిన్లు కూడా మర్చిపోలేని స్పీచ్ ఇస్తారు అని మనం ఊహించి ఉండము. కానీ ఓ మహిళ గురించి అలాగే ఆమె హక్కుల గురించి చెయ్యాల్సిన ఫైట్ గురించి ఈమె చాలా చక్కగా చెప్పింది.

6)కె.జి.ఎఫ్ ప్రీ రిలీజ్ వేడుకలో యష్ ఇచ్చిన స్పీచ్ కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. ఎక్కడైతే నేను ఆకలితో పడుకున్నానో అక్కడే నా కటౌట్ పడాలి అనుకున్నాను అని యష్ మాట్లాడిన మాటల్లో ఉన్న కసి.. ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

7)’మాస్టర్’ సినిమా వేడుకలో విజయ్ స్పీచ్ కూడా ఊర మాస్ అంతే..! స్టేజి పై స్టెప్పులు వెయ్యడం.. పోటీ హీరో అయిన అజిత్ గురించి మాట్లాడటం అతని డౌన్ టు ఎర్త్ నేచర్ ను తెలియజేస్తుంది.

8) ‘ఎవరు’ ప్రీ రిలీజ్ వేడుకలో అడివి శేష్ ఇచ్చిన స్పీచ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీ అతను ఎదుర్కొన్న సమస్యలు, పడిన కామెంట్లు.. వీటన్నిటిని అధిగమించిన తీరుని చాలా బాగా చెప్తాడు.

9) నాన్న ఎందుకో వెనుక పడ్డాడు అంటూ తనికేళ్ల భరణి గారు ఇచ్చిన స్పీచ్ కూడా చాలా ఆలోచింపజేస్తుంది.

10)గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నప్పుడు బ్రహ్మానందం గారు ఇచ్చిన స్పీచ్ కూడా చాలా బాగుంటుంది. వచ్చే జన్మలో ‘దోమనై పుడితే 10 దోమల్ని, కుక్కనై పుడితే 10 కుక్కల్ని.. నవ్వించే శక్తిని ఇవ్వాలని వేడుకుంటున్నట్టు చెప్పి ఆలోచింప చేస్తారు బ్రహ్మానందం గారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus