దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది పాటు కరోనా కల్లోలంలో చిక్కుకున్న సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. మళ్లీ కరోనా కొత్త కేసులు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి హీరోలు కరోనా బారిన పడగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఆమిర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని.. నిబంధనల ప్రకారం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఆమిర్ ఖాన్ ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఓ యాడ్ షూట్ కోసం ఆమిర్ ఖాన్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంది నటి కియారా అద్వానీ. దర్శకుడు నితేశ్ తివారి ఈ యాడ్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఆమిర్ కి కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో ఇప్పుడు కియారా అద్వానీ, నితేశ్ తివారి కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాలో నటిస్తున్నారు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నారు. 1994లో టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ని ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!