Abhinav Gomatam: కల్పిక కాంట్రోవర్సీ.. క్లారిటీ ఇచ్చేసిన అభినవ్ గోమఠం

  • October 30, 2023 / 10:40 AM IST

గత ఏడాది అంటే 2022 చివర్లో నటుడు అభినవ్ గోమఠం పై ప్రముఖ నటి కల్పిక గణేష్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. దీంతో కల్పిక , అభినవ్ ల మధ్య గొడవల కారణంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని చర్చలు జరిగాయి. తాజాగా వీటి పై క్లారిటీ ఇచ్చాడు అభినవ్ గోమఠం. అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ‘కల్పిక కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే. ఆమెతో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే ఆమెతో పెద్దగా పరిచయం కూడా నాకు లేదు.

అయితే మేమిద్దరం అప్పుడప్పుడు చాట్ చేసుకునే వాళ్లం. అప్పుడు ఆమెకు నారీ శక్తి అవార్డు వచ్చిందని నాకు మెసేజ్ చేసింది. దానికి నేను ఈ అవార్డు గురించి నేను ఎప్పుడూ వినలేదే.. కానీ నీకు అవార్డు రావడం చాలా గొప్ప విషయం అభినందనలు అని ఆమెకు చెప్పాను. అంతే.. అప్పటి నుంచి గొడవ స్టార్ట్ చేసింది. అవార్డు గురించి వినలేదా? నీకు అంత చులకనా అవార్డు అంటే? నువ్వు పురుష అహంకారివి అంటూ గొడవ పెట్టుకుంది.

ఆమె అలా మాట్లాడుతుండటంతో.. నేను (Abhinav Gomatam) రిప్లై ఇవ్వడం కూడా మానేశాను. ఆ అవార్డు గురించి నాకు తెలీదు అన్న మాటకు.. మా చాటింగ్ మొత్తం స్క్రీన్ రికార్డు తీసి.. ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. అయితే నెటిజన్లు కూడా అతడు అన్న దాంట్లో తప్పేముంది అని కామెంట్లు చేశారు. ఆ ఒక్క మెసేజ్ తో ఇంత రాద్దాంతం జరిగింది. అంతే తప్ప ఆమెతో ఎలాంటి ప్రేమాయణాలు లేవు” అంటూ చెప్పుకొచ్చాడు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus