అంతా అభినేత్రి స్టెప్ గురించే..!

మిల్కీ బ్యూటీ తమన్నా తొలి సారి టైటిల్ రోల్ పోషిస్తోన్న సినిమా “అభినేత్రి”. దీనిని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, హిందీ వెర్షన్ కు “డెవిల్” అనే పేరు పెట్టారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, సోనూ సూద్, అమీ జాక్సన్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ మూవీ దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో సాంగ్స్ షూటింగ్ ఉంది. అందుకోసం తమన్నా, ప్రభుదేవా, పరేష్ శిరోద్కర్ తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ రిహార్సల్స్ వీడియోని మిల్కీ బ్యూటీ తన ట్విట్టర్ అకౌంట్లో శనివారం పోస్ట్ చేసింది. పది సెకన్ల నిడివితో ఉన్న వీడియోలో తమన్నా, ప్రభుదేవా, పరేష్ శిరోద్కర్ తో కలిసి ఎనర్జటిక్ గా ఒక స్టెప్పు వేసింది. ఈ స్టెప్ డాన్స్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోని ఎక్కువమంది షేర్ చేశారు. అంతగా నచ్చిన ఆ మూవీ మెంట్ ని ప్రభుదేవా కంపోజ్ చేసినట్లు తెలిసింది. ఈ డాన్స్ సీక్వెన్స్ ఒక నిముషం పాటు ఆగకుండా సాగుతుందని, ఇది సినిమాలో ఒక హైలెట్ గా నిలుస్తుందని చిత్ర బృందం వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus