పల్లెకి పోదాం ఛలో ఛలో టాస్క్ లో అభిజిత్ పాయింట్ మాట్లాడి అరియానా నోరు మూయించాడు. అంతేకాదు, టాస్క్ లో ఏముందో నేను అదే ఫాలో అవుతున్నా అంటూ గట్టిగా మాట్లాడాడు. ఫుడ్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుందని అరియానా అన్న పాయింట్ కి అభిజిత్ టాస్క్ గురించి మాట్లాడాడు. నా మనసులో మాట చెప్తున్నా.. ఎప్పుడూ ఫుడ్ వల్లే ప్రాబ్లమ్ వస్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తారు అంటూ అరియానా స్టార్ట్ చేసింది. దీనికి అభిజిత్ గట్టి కౌంటర్ వేశాడు. నాకు మనసులు లేవా.. నేను కూడా మాట్లాడలేనా అంటూ అరియానాతో ఆర్గ్యూకి వచ్చాడు.
ఇక్కడ అరియానా రెండు మూడు పాయింట్స్ తో అభిజిత్ ని లాక్ చేద్దామని చూసింది. ఫస్ట్ మోనాల్ నువ్వు కలిసి ఆడుతున్నారు కదా అన్నది. ఎందుకంటే, మోనాల్ ని అయితే ఈజీగా కన్విన్స్ చేసుకోవచ్చుని, అవును ఆడుతున్నాము అన్నాడు అభిజిత్. తర్వాత తనకి కావాల్సిన ఆమ్లెట్ గురించి చెప్పింది. ఆమ్లెట్ ఇవ్వడం కుదరదు అన్నట్లుగా అభి చెప్పేసరికి అరియానా ప్రతిసారి ఫుడ్ తోనే ప్రాబ్లమ్ వస్తుందని పాయింట్ అన్నది. ప్రతిసారి అని అద్దు అని అభిజిత్ కౌంటర్ వేశాడు. అయినా కూడా అరియానా ఆగలేదు నోరు పారేసుకుంది. అసలు గేమ్ లో నువ్వు డోర్ ఎందుకు వేశావ్ అభిజిత్ అని అడిగింది.
ప్రతిసారి గేమ్ లో నీ వల్లే పాజ్ వస్తుంది అనేసరికి అభిజిత్ రైజ్ అయ్యాడు. ప్రతిసారి ఎందుకొస్తోంది అని అన్నాడు. నీకేమైన ఉంటే ఊరిపెద్ద అయి సోహైల్ తో మాట్లాడుకోమన్నాడు. అంతేకాదు, ఫస్ట్ టైమ్ నేను పాయింట్ రైజ్ చేస్తున్నా అనేసరికి అభిజిత్ అక్కడ అరియానాకి పంచ్ వేశాడు. నువ్వేదో మాట్లాడి రియాక్షన్ ఎక్స్ పెక్ట్ చేయకుండా వెళ్లి కూర్చోవద్దు అన్నాడు. ఫుడ్ తో ప్రాబ్లమ్ వస్తుంది అంటే అది టాస్క్ లో భాగం అనే కరెక్ట్ గా చెప్పాడు అభిజిత్. దీంతో అరియానాకి ఆన్సర్ లేకుండా పోయింది. అంతేకాదు, తర్వాత అమ్మరాజశేఖర్ కి, అవినాష్ కి , లాస్యకి తన గోడుని మొరపెట్టుకుంది.