బిగ్ బాస్ 4: కెప్టెన్ అమ్మ స్ట్రాటజీ ఇదే..!

  • November 7, 2020 / 12:25 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇప్పుడు 10వ వారంలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అమ్మరాజశేఖర్ మాస్టర్ కెప్టెన్ అయిన తర్వాత రూలర్ గా రూల్స్ పెడుతుంటే హౌస్ మేట్స్ అబ్జక్ట్ చేస్తూ రెచ్చిపోయారు. నిజానికి కెప్టెన్ అయిన తర్వాత అమ్మ అవినాష్ కి, మెహబూబ్ కి ఇష్టమున్న డిపార్టెమెంట్ తీస్కోమని, పని ఎక్కడ తక్కువ ఉంటుందో అది ఎంచుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఏమీ తెలియదు అన్నట్లుగా వచ్చి హౌస్ మేట్స్ అందరికీ వర్క్ డివైడ్ చేశాడు. అంతేకాదు, అరియానాని కేవలం అసిస్టెంట్ గా నియమించుకుని వర్క్ డివైడ్ చేయడం ఫస్ట్ హౌస్ మేట్స్ కి నచ్చలేదు.

ఈవిషయాన్ని ఫస్ట్ హారిక వ్యతిరేకించింది. తర్వాత అభిజిత్ మేము చేయము అన్నట్లుగా మాట్లాడాడు. అంతేకాదు, అమ్మ చేస్తున్న యాక్టింగ్ కి అభిజిత్ రియాక్షన్ ఇస్తూ లాజిక్ మాట్లాడాడు. డిషెష్ కి ఎక్కువ వర్క్ ఉంటుందని అందుకే ఇంకో పర్సన్ ఇమ్మని చెప్పాడు. మెహబూబ్ వాష్ రూమ్ అయిన తర్వాత ఖాళీగానే ఉంటాడు కాబట్టి డిషెష్ వర్క్ అప్పజెప్పమని అన్నాడు. దీంతో అమ్మరాజశేఖర్ నా కెప్టెన్సీ నాఇష్టం నువ్వు కెప్టెన్ అయ్యాక మాట్లాడుకో అనేసరికి అభిజిత్ కి కోపం వచ్చింది. అక్కడ ఉన్న అఖిల్ కూల్ చేశాడు. కానీ, మాస్టర్ మోనార్క్ లాగా తను పెట్టిందే శాసనం అలాగే జరగాలని చాలాసేపు ఆర్గ్యూచేశాడు.

ఇప్పుడు వర్క్ డివైడ్ లో క్లాషెష్ రావడం అనేది హౌస్ మేట్స్ మద్యలో చిచ్చురేపుతోంది. అంతేకాదు, అమ్మరాజశేఖర్ మాస్టర్, అవినాష్ ఇద్దరూ కూడా అరియానా గేమ్ ని ఇన్ఫులెన్స్ చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ పై ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus