105 రోజుల పాటు కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ఆదివారం ఎపిసోడ్ తో ఎండ్ అయ్యింది. అసలు ఈ సారి షో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ కరోనా కష్ట కాలంలో నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా షోను ముందుకు నడిపించారు. ఇక విన్నర్ గా నిలిచిన అభిజిత్ నెవర్ బిఫోర్ అనేలా క్రేజ్ అయితే అందుకున్నాడు. అసలు మ్యాటర్ ఏమిటంటే..
అభిజిత్ ఈ షో ద్వారా ఎంతవరకు లాభం అందుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అందరికంటే ఎక్కువ ఓట్లు అందుకోవడమే కాకుండా ఆదాయం కూడా గట్టిగానా అందుకున్నాడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు అభిజిత్ కు అందిన మొత్తం ఆదాయం రూ.60లక్షలని తెలుస్తోంది. ఇక ప్రైజ్ మనీలో అతనికి దక్కింది 25లక్షలు. అంతకుముందు రౌండ్ లో సోహెల్ 25లక్షలు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఇక బిగ్ బాస్ రెమ్యునరేషన్ అలాగే ప్రైజ్ మనీతో కలిపి అభికి 85లక్షలు అందాయి. అలాగే మూడు లక్షల విలువ గల స్టైలిష్ బైక్ ను కూడా అభిజిత్ బోనస్ గా గెలుచుకున్నాడు. ఒక విధంగా అభికి గుర్తింపు రావడమే కాకుండా మూడు నెలలు బిగ్ బాస్ లో ఉన్నందుకు మంచి ఆదాయం కూడా దక్కింది.