మళ్ళీ వాయిదాపడిన ఆచారి అమెరికా యాత్ర!

  • April 1, 2018 / 01:07 PM IST

పాపం మంచు విష్ణు అదృష్టం బాగోలేదో లేక టైమ్ బాగోలేదో తెలియదు కానీ.. “ఆచారి అమెరికా యాత్ర” అనే సినిమా మొదలెట్టినప్పట్నుంచి ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నాడు. షూటింగ్ టైమ్ లో తీవ్రంగా గాయపడి దాదాపు మూడునాలుగు వారాలపాటు మంచానపడిన మంచు విష్ణు.. మళ్ళీ కోలుకొని షూటింగ్ పూర్తి చేశాడు. తన ఫేవరెట్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డి, ఫేవరెట్ కోస్టార్ బ్రహ్మానందంలతో కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో షూటింగ్ టైమ్ లో ఎన్ని ప్రోబ్లమ్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు విష్ణు. అయితే.. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఇప్పటికీ మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వకపోవడం పట్ల మాత్రం అసంతృప్తితో ఉన్నాడు.

ముందు ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకొన్నారు, తర్వాత మార్చికి షిఫ్ట్ అయ్యింది. అప్పుడు కూడా కుదరకపోవడంతో ఏప్రిల్ 6కి రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే.. “రంగస్థలం” సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం, సరిగ్గా ఒకరోజు ముందు ఏప్రిల్ 5న నితిన్ “చల్ మోహన్ రంగ” విడుదలవుతుండడం, ఏప్రిల్ 20న మళ్ళీ “భరత్ అనే నేను” విడుదలవుతుండడంతో.. ఈమధ్యలో వచ్చి నలిగిపోవడం ఎందుకనుకొన్నారో ఏమో కానీ.. తమ చిత్రాన్ని ఏకంగా ఏప్రిల్ 26కి షిఫ్ట్ చేశారు. మరి ఇన్నిసార్లు వాయిదాపడిన “ఆచారి అమెరికా యాత్ర” రిజల్ట్ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus