చరణ్, తారక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడానికి మరో 24 రోజుల సమయం మాత్రమే ఉంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ మొదలుపెట్టనున్నారు. ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయిన రికార్డులన్నీ ఈ సినిమాతో కచ్చితంగా బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ బలంగా విశ్వసిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతుండటం గమనార్హం.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. రాజమౌళి తనకు ఏం అవసరమో క్లారిటీగా చెబుతారని ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని నిక్ పావెల్ వెల్లడించారు. ఆ యాక్షన్ సీన్లు చాలా డిఫికల్ట్ సీన్లు అని ఆయన కామెంట్లు చేశారు.
నెలరోజుల ముందే తాను చేయాల్సిన యాక్షన్ సీన్ల గురించి దర్శకుడు రాజమౌళి వివరించారని పెద్ద సీక్వెన్స్ లతో క్లైమాక్స్ లో యాక్షన్ సీన్లు వస్తాయని ఈ సీన్ల కొరకు చాలా శ్రమించామని సినిమాకు ఈ సీన్లు ప్లస్ అవుతాయని నిక్ పావెల్ అన్నారు. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం చరణ్, తారక్ ఎంతో కష్టపడ్డారని ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండే చరణ్, తారక్ యాక్షన్ సీన్ల షూటింగ్ సమయంలో చాలాసార్లు కింద పడ్డారని నిక్ పావెల్ చెప్పుకొచ్చారు.
సెట్ లో ఇద్దరు హీరోలు ఫన్నీగా ఉండేవారని కిందపడినా చరణ్, తారక్ ఉత్సాహంతో పని చేసేవారని నిక్ పావెల్ పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో వర్క్ ను ఎంజాయ్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!