సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!

సరోగసీ ద్వారా పిల్లలను కనే సెలబ్రిటీల లిస్ట్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు సరోగసీ పద్దతికే ఓటేస్తున్నారు. ఒకప్పుడు పిల్లలు కలగని వారు ఎడాప్ట్ చేసుకునేవారు.. కానీ ఇప్పడు టెక్నాలజీ పెరిగిపోవడంతో సరోగసీ పద్ధతి ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా కెరీర్ కు బ్రేక్ ఇవ్వడం ఇష్టం లేని చాలా మంది హీరోయిన్లు, అలానే ఇతర కారణాల వలన సరోగసీ పద్దతి వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఓ లుక్కేద్దాం రండి :

1) శిల్పాశెట్టి :

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి 2020లో సరోగసీ పద్ధతి ద్వారా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తన కూతురుకి సమీషా అని పేరు పెట్టుకుంది.

2) ప్రీతీజింతా :

ఈ బ్యూటీ సరోగసీ పద్దతిలో కవల పిల్లలను తమ జీవితంలోకి ఆహ్వాయించింది. గతేడాది నవంబర్ లో ప్రీతిజింతా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

3) ఏక్తా కపూర్ :

ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ 2019లో సరోగసీ ద్వారా కుమారుడికి జన్మనిచ్చింది. 36 ఏళ్ల ఈ బ్యూటీ ముందుగానే తన అండాన్ని భద్రపరుచుకుంది.

4) ఫరాఖాన్ :

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా 2008లో బిడ్డను కంది.

5) కరణ్ జోహార్ :

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ 2017లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

6) షారుఖ్ ఖాన్ :

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన చిన్న కొడుక్కి జన్మనిచ్చింది కూడా సరోగసీ ద్వారానే.

7) ఆమీర్ ఖాన్ :

రీసెంట్ గా విడాకులు తీసుకున్న ఆమీర్ ఖాన్, కిరణ్ రావు 2011లో సరోగసీ ద్వారా ఆజాద్ రావ్ ఖాన్ కు జన్మనిచ్చారు.

8) సన్నీలియోన్ :

బాలీవుడ్ నటి సన్నీ కూడా సరోగసీ ద్వారానే ఇద్దరు పిల్లలకు తల్లయింది.

9) మంచు లక్ష్మీ :

టాలీవుడ్ నటి, హోస్ట్ మంచు లక్ష్మీ సరోగసీ పద్ధతి ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది.

10) ప్రియాంక చోప్రా :

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లు సరోగసీ ద్వారా తల్లితండ్రులమయ్యామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

11) నయన తార:

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార చాలా కాలంగా దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఈ ఏడాది జూన్ లో అయ్యింది. అయితే సడన్ గా వీరికి కవల పిల్లలు పుట్టినట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. సరోగసి పద్దతి ద్వారా వీరు తల్లిదండ్రులు అయినట్టు స్పష్టమవుతుంది.

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus