చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

గతేడాది చైసామ్ లు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. 2021 కంప్లీట్ అయినా ఆ షాక్ నుండీ ఇంకా ఎవ్వరూ కోలుకోలేదు. ఇంతలోనే మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి మరో పెద్ద షాక్ ఇచ్చాడు. వాళ్ళే ధనుష్- ఐశ్వర్య. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య.. రజినీకాంత్ క్రేజ్ తో తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న ధనుష్… వీళ్ళ విడాకుల టాపిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. వీళ్ళు పెళ్ళి చేసుకుని దాదాపు 18 ఏళ్ళు పూర్తయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయినా వీళ్ళు విడాకులు తీసుకోవడం ఏంటి? అనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వెల్లడవుతున్నాయి. వీళ్ళు మాత్రమే కాదు గతంలో సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది ఎవ్వరూ ఊహించని విధంగా షాక్ లు ఇచ్చారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) శారద-చలం :

 

అలనాటి నటి శారద ఒకప్పటి హీరో చలం గారిని ప్రేమించి 1972లో పెళ్లి చేసుకుంది. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 1984లో విడిపోయారు.

2) శరత్ బాబు -రమప్రభ :

శరత్ బాబు, రమాప్రభ ఇద్దరూ కూడా ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా చక్రం తిప్పిన వాళ్ళే. శరత్ బాబు అయితే హీరోగా కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని 1974లో పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 1988 లో విడిపోయారు.

3) కమల్ హాసన్- సారిక :

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మొదట డ్యాన్సర్ అయిన వాణి గణపతిని 1978లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పది సంవత్సరాలు కలిసి సంతోషంగా గడిపారు. బాబు కూడా పుట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల 1988లో విడాకులు తీసుకున్నారు. తర్వాత తనతో నటించిన హీరోయిన్ సారికను కమల్ ప్రేమించి రెండో 1988లోనే రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి శృతి హాసన్, అక్షర హాసన్ లు సంతానం.అయితే ఊహించని విధంగా రెండో భార్య సారికతో కూడా 2004లో విడాకులు తీసుకున్నాడు కమల్. అటు తర్వాత హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశారు. తర్వాత ఆమెతో కూడా విడిపోయాడు.

4) ప్రకాష్ రాజ్ – లలిత కుమారి :

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని ప్రేమించి 1994లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.అయితే కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2009లో విడిపోయారు. తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని 2010లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికో పాప ఉంది.

5) సిద్దార్థ్- మేఘన :

వీరిద్దరూ 2003 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వలన 2007 లో విడిపోయారు.

6) నాగార్జున-లక్ష్మీ:

అక్కినేని నాగార్జునకి… మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ అయిన డి.రామానాయుడు కుమార్తె లక్ష్మీతో 1984లో వివాహమైంది. కానీ 1990 లో వీరి బంధం తెగిపోయింది.

7) సుమంత్-కీర్తిరెడ్డి:

అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగార్జున మేనల్లుడు సుమంత్ యార్లగడ్డ మావయ్య దారిలోనే సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డి తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఈ జంట జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత ఇద్దరికి పోసకపోవడం, సుమంత్ సోదరి సుప్రియతో కూడా విబేధాలు రావడంతో పెళ్లయిన రెండేళ్లకే 2006లో విడాకులు తీసుకున్నారు.

8) సుప్రియ యార్లగడ్డ- చరణ్ రెడ్డి :

అక్కినేని వంశానికే చెందిన సుప్రియ మావయ్య నాగార్జున, అన్నయ్య సుమంత్ దారిలో ప్రేమ వివాహం చేసుకుంది. ఇష్టం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెడ్డిని ఈమె ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగానే ఉన్న ఈ జంట ఓ పాపకి కూడా జన్మనిచ్చారు. అయితే ఆ తర్వాత చరణ్ చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. ఎంత చెప్పినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులిచ్చేసింది సుప్రియ. ఆమెతో విడిపోయిన తర్వాత కూడా చరణ్‌లో ఎలాంటి మార్పు రాకపోగా, వ్యసనాలకు మరింత దగ్గరై… ప్రాణాలను కోల్పోయాడు.

9) పవన్ కల్యాణ్- రేణూ దేశాయ్:

పవర్‌స్టార్‌గా, యూత్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ సైతం ప్రేమలో పడ్డాడు. ‘బద్రి’ సినిమా షూటింగ్‌లో ఉత్తరాదికి చెందిన రేణూ దేశాయ్‌ని ప్రేమించి..డేటింగ్ తర్వాత ఆమెను వివాహాం చేసుకున్నాడు. ఆయనకు అప్పటికే విశాఖకు చెందిన నందినితో పెళ్లయ్యింది.అయితే కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది.రెండో పెళ్లిలో పక్క రాష్ట్రానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన పవర్ స్టార్.. మూడోసారి ఏకంగా విదేశీయురాలి ప్రేమకు దాసోహమయ్యాడు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘తీన్‌మార్’సినిమా సమయంలో రష్యా పౌరురాలు అన్నా లెజ్‌నోవాను పెళ్లి చేసుకున్నారు.

10) నాగచైతన్య-సమంత:

అక్కినేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నవయువ సామ్రాట్ నాగచైతన్య. ప్రేమ కథలు, రోమాంటిక్ జోనర్స్‌లో తాత, తండ్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా నటిస్తూ యూత్‌లో లవర్ బాయ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో తండ్రిలాగే ప్రేమ వివాహానికే చైతు మొగ్గు చూపాడు. ‘ఏమాయ చేశావే’ లో తనతో పాటు నటించిన సమంతతో ప్రేమలో పడిన నాగచైతన్య.. లాంగ్ రన్‌లో డేటింగ్ చేసి పెద్దల అంగీకారంతో సమంతని 2017లో పెళ్లి చేసుకున్నాడు. సమంత కేరళకు చెందిన క్రిస్టియన్ అమ్మాయి. కాగా, చైతు తెలుగబ్బాయి. వీరిద్దరూ పెళ్లి విషయంలో తమ రెండు మత సంప్రదాయాలను పాటించారు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా వీళ్ళు ఈ ఏడాది(2021) లో విడిపోయారు.

11) ఝాన్సీ – జోగినాయుడు:

ఇద్దరూ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకునేవారు. తర్వాత వీళ్ళ పరిచయం ప్రేమగా మారడం.. పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు.

12) రేవతి – సురేష్ చంద్ర మీనన్:

1986 లో పెళ్ళిచేసుకున్న రేవతి- సురేష్ చంద్ర మీనన్ ల జంట 2013 లో విడిపోయారు.

13) మమతా మోహన్ దాస్ :

సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టి టాప్ హీరోయిన్ గా ఎదిగిన మమతా మోహన్ దాస్… ప్రజీత్ పద్మనాభన్ ను 2011లో వివాహం చేసుకుని…. 2012 లో విడిపోయింది.

14) ఆదితీ రావు హైదరి :

ప్రెజెంట్ క్రేజీ హీరోయిన్ అయిన అదితీ రావు హైదరి…వ్యాపారవేత్త సత్యదీప్ మిశ్రా పెళ్లి చేసుకుని 2013 లో విడిపోయింది.

15) మంచు మనోజ్ – ప్రణతి :

2015 లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట… 2019 లో విడిపోయారు.

16) నోయల్ – ఎస్తేర్ :

ఈ జంట 2019 లో పెళ్ళిచేసుకుని.. 2020 లో విడిపోయారు.

17) అరవింద స్వామి – గాయత్రి రామమూర్తి :

ఈ జంట 1994 లో పెళ్లి చేసుకుని 2010 లో విడిపోయారు.

18) రాధిక – ప్రతాప్ పోతన్ :

1985 లో పెళ్ళి చేసుకున్న ఈ జంట 1992 లో విడిపోయారు.

19) శ్వేతా బసు ప్రసాద్- రోహిత్ మిట్టల్ :

2018 లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2019 లో విడిపోయారు.

20) ధనుష్ – ఐశ్వర్య :

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య .. ఎవ్వరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus