మీరు చూశారా… సెల్ఫీ తీసారా : అలీ
- April 3, 2019 / 05:05 PM ISTByFilmy Focus
ప్రముఖ హాస్య నటుడు, పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన అలీ.. ఇటీవల వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అయన పై టీడీపీ మహిళా నేత దివ్యవాణికి కౌంటర్ ఇచ్చారు. అలీ ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… ‘ప్యాకేజ్ అందడం వలనే అలీ వైసీపీలో చేరారంటూ’ ప్రముఖ నటి తెలుగుదేశం కార్యకర్త దివ్య వాణి ఆరోపించారు. దీనికి అలీ కాస్త ఘాటుగానే కౌంటరిచ్చాడు.
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
- ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ విషయం పై అలీ స్పందిస్తూ… “నేను ప్యాకేజీ తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేకపోతే సెల్ఫీ ఏమైనా తీశారా. అసలు ‘టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో కాస్త చెప్తారా” అంటూ కౌంటర్ ఇచ్చాడు అలీ. ఏదేమైనా ఈ ఎన్నికల్లో కొంత మంది సినీ నటులు వివిధ పార్టీలకు ప్రచారం చేస్తూ మధ్య మధ్యలో ఇలా ఒకరి ఒకరు విమర్శలు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక ఎన్నికలు ముగిసేలోపు సినీనటుల నుండీ ఇంకెన్ని విమర్శలు వినాల్సొస్తుందో మరి..!














