Vijayakanth: ఒకట్రెండు రోజుల్లో డిశ్ఛార్జి అంటున్న డీఎండీకే
- May 19, 2021 / 12:27 PM ISTByFilmy Focus
ప్రముఖ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో చెన్నైలోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యబృందం పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. అయితే ఆయన పార్టీ డీఎండీకే మాత్రం కెప్టెన్ జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తారని పత్రిక ప్రకటన విడుదల చేసింది.

అయితే గత కొన్నేళ్లుగా ఆయన వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. విజయ్‌కాంత్ గతేడాది సెప్టెంబరులో ఒకసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల వైద్యం తర్వాత కోలుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు విజయ్‌కాంత్ త్వరలో ఇంటికి చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!













