కండలు పెంచుతున్న ఆర్యన్ రాజేష్

  • July 5, 2016 / 01:25 PM IST

దర్శక నిర్మాత ఈవీవీ సత్యనారాయణ పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ కండలు పెంచుతున్నారు. పదిహేనేళ్ల క్రితం “హాయ్” సినిమా ద్వారా పలకరించిన రాజేష్ సొంతం, ఎవడిగోల వాడిదే, లీలా మహల్ సెంటర్ వంటి మోస్తరు విజయాలను అందుకున్నారు. పదేళ్ల పాటు శ్రమించినా మంచి బ్రేక్ రాక పోయేసరికి పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత కాలం దూరమయ్యారు. నిర్మాతగా మారి తమ్ముడు అల్లరి నరేష్ “బందిపోటు” చిత్రాన్ని నిర్మించారు. ఆ మూవీ ఆశించినంత హిట్ కాలేదు. అయినా సినీ రంగం మీద ప్రేమను వదులుకోలేదు. విలన్ పాత్రలో నటించడానికి డిసైడ్ అయ్యారు.

పరిశ్రమలో హీరోలు ఎక్కువగా ఉన్నారని, విలన్లు తక్కువమంది ఉన్నారని.. అందుకే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసేందుకు తన అన్నయ్య ఆసక్తిగా ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం అల్లరి నరేష్ చెప్పారు. ప్రతికథానాయకుడిగా మెప్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు. విలన్ పాత్రల్లో కనిపించిన జగపతిబాబు, ఆది పినిశెట్టి లకు వస్తున్న క్రేజ్ చూసి రాజశేఖర్, శ్రీకాంత వంటి హీరోలు కూడా విలనిజం ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. ఆ బాటలోనే ఇప్పుడు రాజేష్ నడిచేందుకు ముందుకువచ్చారు. అందుకోసం కసరత్తులు మొదలు పెట్టారు. హీరోకు గట్టి పోటీ ఇవ్వడానికి కండలు పెంచేందుకు ఎక్కువగా జిమ్ లోనే గడుపుతున్నట్లు సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus