ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. సినీ పరిశ్రమలో కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే చాలు వెంటనే వాళ్ళు ప్రెగ్నెన్సీ…వార్తలు పుట్టుకొస్తున్నాయి. అవి నిజమైతే సెలబ్రిటీలు కొంతకాలం మౌనంగా ఉండి ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తున్నారు. లేదు అంటే వెంటనే రియక్ట్ అయ్యి అవి అవాస్తవాలు అని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రానా, ఆది పినిశెట్టి ల భార్యలు గర్భం దాల్చినట్టు ప్రచారం జరిగింది.
అందులో నిజం లేదు అని వాళ్ళు కలుగజేసుకుని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో నటుడి భార్య కూడా గర్భం దాల్చినట్టు కథనాలు పుట్టుకొస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆ నటుడికి ఇప్పుడు 51 సంవత్సరాలు. విషయంలోకి వెళితే..బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ తివారి మూడోసారి తండ్రి కాబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా అతనే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. అలాగే తన భార్య సురభి తివారి సీమంతం ఫంక్షన్ కు సంబంధించిన వీడియోని కూడా
ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు మనోజ్. ‘కొన్ని మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేము. ఈ ఆనందం జీవితాంతం తోడు ఉంటుంది అని భావిస్తున్నాను ‘ అంటూ ఇతను క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 1999లో మనోజ్… రాణి అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రితి అనే పాప ఉంది.అయితే 2012లో వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
తర్వాత మనోజ్ సురభి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2020లో పాప పుట్టింది. తాజాగా మరోసారి తండ్రి కాబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక మనోజ్ బిగ్ బాస్ హిందీ నాలుగో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈయన ఎంపీగా ఉన్నారు.